ప్రస్తుతం మార్కెట్ పై పట్టు సాధించాలని కార్ల కంపెనీలన్ని పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో రెనో నుండి కొత్త క్విడ్ అత్యంత చౌకైన వాహన రేటుతో మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. రెనో నుండి వస్తున్న ఎంట్రీ లెవల్ మోడల్ గా రెనో క్విడ్ లైఫ్ ఫర్ మోర్ రీలోడెడ్ 2018 గా క్విడ్ న్యూ వర్షన్ రిలీజ్ అవుతుంది. 0.8 లీటర్ స్పెషల్ ఎడిషన్ తో వస్తున్న ఈ వెహికల్ ధర 2.66 లక్షలుగా నిర్ణయించబడింది.


అయితే ఇదే మోడల్ లో 1.0 లీటర్ స్పెషల్ ఎడిషన్ మాత్రం 3.87 లక్షలుగా నిర్ణయించారు. ఇక మునుపటి క్విడ్ కన్నా ఈ సరికొత్త క్విడ్ మరికొన్ని ఆకర్షణీయమైన కలర్స్ తో కొత్త లుక్ తో వస్తుంది. కచ్చితంగా ఇది మార్కెట్ ను శాసిస్తుందని అంచనా వేస్తున్నారు వాహన విక్రయ నిపుణులు. రెనో క్విడ్ లైవ్ ఫర్ మోర్ రీలోడెడ్ వెహికల్ తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్స్ తో రాబోతుంది.


ఇప్పుడిప్పుడే మార్కెట్ మీద పట్టు సాధిస్తున్న రెనో వెహికల్స్ లో 2018 లో ఈ రెనో రీలోడెడ్ స్పెషల్ ఎడిషన్ మాత్రం కచ్చితంగా వాటి సేల్స్ ను పెంచుతుందని అంటున్నారు. కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేసే అదనపు ఆకర్షణలు కూడా ఈ వెహికల్ తో వస్తున్నాయట. మరి తక్కువ ధరలో మెరుగైన వెహికల్ కావాలనుకునే వారు రెనో క్విడ్ స్పెషల్ ఎడిషన్ పై ఓ లుక్కేస్తే బెటరేమో.  



మరింత సమాచారం తెలుసుకోండి: