సుజుకి నుండి సరికొత్త జిఎసెక్స్-ఎస్750 లాంచింగ్ కు రెడీ అయ్యింది. రాబోయే మూడు నెలల్లో ఈ బైక్ ను రిలీజ్ చేయబోతున్నారు. అధునాత టెక్నాలజీతో ఈ బైక్ ఫుల్ అప్డేటెడ్ వర్షన్స్ తో వస్తుంది. 749 సిసి కెపాసిటీ ఇంజిన్ తో వస్తున్న ఈ బైక్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ తో 113 బిహెచ్పి, 81 ఎన్నెం టార్క్ తో అందుబాటులో ఉంచుతుంది.


ఇక సుజుకి నుండి యాక్సెస్ 125 సరికొత్త మోడల్ కూడా రిలీజ్ అవుతుంది. 125 సిసి కెపాసిటీతో వస్తున్న ఈ స్కూటర్ 8.5 బిహెచ్పి, 10.2 ఎన్నెం టార్క్ తో అందుబాటులోకి వస్తుంది. ఈ సరికొత్త మోడల్స్ తో మళ్లీ మార్కెట్ మీద పట్టు సాధించాలని చూస్తుంది సుజుకి. 


ఇక రాబోయే రోజుల్లో కూడా సుజుకి నుండి మైలేజ్ బైక్ ఇంకా స్కూటర్స్ కూడా రిలీజ్ చేస్తారట. చూస్తుంటే మార్కెట్ లో మిగతా వాహనాలకు సుజుకి కూడా గట్టి పోటీ ఇచ్చి తీరుతుందని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: