బెంగళూరుకి చెందిన మోటార్ సంస్థ ఏథర్ కొత్తగా మార్కెట్ లోకి రెండు సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను రిలీజ్ చేస్తుంది. పర్యావరణ మేలు కోసం ఎలక్ట్రిక్ వెహికల్ వాడకం తప్పనిసరి అయ్యింది. రానున్న కాలంలో బైకులు, కార్లు కూడా మొత్తం ఎలెక్ట్రిక్ మయం కానున్నాయి. ఇప్పటికే ఆ కార్యచరణలు మొదలుపెట్టారు.


ఇక ఏథర్ నుండి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ 340, 450 రిలీజ్ అవుతున్నాయి. ఏథర్ ఎనర్జీ స్టార్టప్ 340 ఎలెక్ట్రిక్ స్కూటర్ 1.09 లక్షలు.. 450 స్కూటర్ 1.24 లక్షలుగా నిర్ణయించబడింది. ఈ రెండు స్కూటర్స్ చూసేందుకు ఒకేలా ఉన్నా 450 స్కూటర్ వీల్స్ కు గ్రీన్ కలర్ స్టిక్కర్ ఉంటుంది. ఇండియాకు సంబందిచిన తొలి స్మార్ట్ ఎలెక్ట్రిక్ స్కూటర్ ఏథర్ తయారుచేయడం విశేషం. 


ఏథర్ ఎనర్జీ సిస్టెంతో రయారు చేయబడిన ఈ స్కూటర్స్ బ్రష్ లెస్ డిసి మోటార్ (బి.ఎల్.డి.సి) మరియు బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టెం తో అందుబాటులో ఉన్నాయి. ఇది 3 ఏళ్ల పాటు అపరిమిత కిలోమీటర్లు తిరిగే సామర్ధ్యం కలిగి ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్లకు ధీటుగా 20 ఎం.ఎం టార్క్ పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి. జీరో నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 5.1 సెకన్స్ లో అందుకుంటుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: