బజాజ్ నుండి వచ్చిన పల్సర్ రికార్డ్ సేల్స్ రిపోర్టులతో మిగతా మోటార్ కంపెనీలకు షాక్ ఇచ్చింది. మే 2018 బజాజ్ పల్సర్ సీరీస్ ల సేల్స్ అన్ని మోటర్ బైకుల కంటే అధికంగా ఉండటం విశేషం. యూనిట్స్ వైజ్ గా చెప్పుకుంటే ఒక్క మే నెలలోనే 70,000 సేల్స్ సాధించింది బజాజ్ పల్సర్.


చాలా ఏళ్ల తర్వాత పల్సర్ ఈ రేంజ్ అమ్మకాలు కలిగి ఉండటం విశేషం. కొన్నాళ్లుగా పల్సర్ రేంజ్ ఆశించిన స్థాయిలో సేల్స్ కలిగి లేవు. ఇటీవల రిలీజ్ అయిన పల్సర్ క్లాసిక్ 150 తో సేల్స్ బాగా పెరిగాయి. మే 2018లో పల్సర్ 150 మోడల్ ఒక్కటే 52,759 యూనిట్ సేల్స్ కలిగి ఉన్నాయి. 


2017 లో పోల్చితే ఈ ఇయర్ 46 శాతం వృద్ధి రేటు సాధించాయని చెప్పొచ్చు. బజాజ్ పల్సర్ సీరీస్ లో ఇండియన్ మార్కెట్ లో 8 మోడల్స్ తో అందుబాటులో ఉంది. మరి ఈ సేల్స్ చూస్తుంటే మళ్లీ బజాజ్ పల్సర్ నెంబర్ 1 బైక్ గా కస్టమర్స్ మెప్పు పొందేలా ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: