స్వీడన్ కు చెందిన లక్సరీ కార్ల సంస్థ వోవ్లో రెండు సరికొత్త మోడల్స్ ను మార్కెట్ లో రిలీజ్ చేస్తుంది. వోల్వో ఎక్స్.సి40 రెండు వేరియెంట్స్ లో బుకింగ్స్ మొదలుపెట్టింది. ఎక్స్.సీ-40 డీ4 మెమెంటం, డి4 ఇన్ స్క్రిప్షన్ మరో వెరియెంట్ గా రిలీజ్ కాబోతుంది. వీటి బుకింగ్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది.


ఇక ఈ వెహికల్ రేటు విషయానికొస్తే.. డి4 మెమెంటం 39.9 లక్షలు, డి4 ఇన్ స్క్రిప్షన్ 43.9 లక్షలుగా నిర్ణయించబడింది. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగా బుక్ చేసుకున్న వారికి ఈ నెల చివరి నుండి వెహికల్స్ అందుబాటులోకి వస్తాయని తెలుస్తుంది. 


ఇప్పటివరకు 200 యూనిట్ల ఆర్డర్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. 2 లీటర్ల డీజిల్ ఇంజిన్ కెపాసిటీ కలిగిన ఈ వెహికల్ 190 హార్స్ పవర్ శక్తితో వస్తుంది. 7 ఎయిర్ బ్యాగ్స్ తో ఈ వెహికల్ అధునాతన టెక్నాలజీతో వస్తుంది. లక్సరీ కారు కొనాలనుకునే వారికి వోల్వో ఈ సరికొత్త వెహికల్స్ ను ఓసారి ట్రై చేయొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: