బజాజ్ కస్టమర్స్ కు ప్రత్యేకమైన పరిమిత కాలపు ఆఫర్లతో కస్టమర్స్ ను ఉత్సాహంలో ముంచెత్తేలా చేస్తున్నారు. బజాజ్ టూ వీలర్ కొన్న ప్రతి కస్టమర్స్ కు మూడు పరిమిత కాలపు ఆఫర్లను అందిస్తున్నారు. అయితే ఆ ఆఫర్లు ఏంటంటే.. ముందు బజాజ్ ఏ టూ వీలర్ కొన్నా వాటికి ఉచిత ఇన్సూరెన్స్ అందిస్తుంది.


ఇక ఆ తర్వాత రెండేళ్ల పాటు ఫ్రీ సర్వీసెస్ అందించడమే కాకుండా ఐదేళ్ల పాటు వారెంటీ కూడా అందిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇవి అన్ని బజాజ్ బైకులకు కాదని తెలుస్తుంది. కేవలం బజాజ్ పల్సర్, అవెంజర్, డామినర్ రేంజ్ బైకులకే అని అంటున్నారు. జూలై లో కొనుగోలు చేసుకునే కస్టమర్స్ కు ఈ ఆఫర్ వర్తిస్తుంది.


ఉచిత ఇన్సూరెన్స్ తో పాటుగా ఫ్రీ సర్వీస్ ఇంకా అదనంగా మరో మూడేళ్లు ఇంజిన్ వారెంటీ ఇస్తుందట. ఇప్పటిదాకా బజాజ్ పల్సర్ 150, 160, వి-15, డిస్కవరీ బైకులకే ఫ్రీ ఇన్సూరెన్స్ ఉండగా ఇప్పుడు అన్నిటికి అందిస్తున్నారు. ఇప్పటికే బజాజ్ దేశీయ మార్కెట్ లో మంచి సేల్స్ కలిగి ఉండగా ఈ ఆఫర్లతో మరింత సేల్స్ పెంచుకునే అవకాశం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: