యమహా నుండి సరికొత్తగా రెండు మోడల్స్ రిలీజ్ అవుతున్నాయి. యమహా సెలుటో ఆరెక్స్, సెలుటో 125 రెండు వేరియెంట్స్ లో కొత్త మోడల్స్ వస్తున్నాయి. ఈ బైక్ ధరలు ఎలా ఉన్నాయంటే సెలుటో ఆరెక్స్ యుబిఎస్ బైక్ 53,000 రూపాయల ఎక్స్ షో రూం ప్రైజ్ తో వస్తుంది. 125 సిసి బైక్ 58,000 రూపాయలతో వస్తుంది.


డిస్క్ బ్రేక్ సిస్టెం కావాలి అనుకుంటే ఆ మోడల్ బైక్ 60,000 రూపాయలకు వస్తుంది. సెలుటో ఆరెక్స్ 110 సిసి కెపాసిటీతో 7.5 హెచ్.పి, 8.5 ఎన్.ఎం టార్క్ తో వస్తుంది. ఇక 125 సిసి బైక్ 8.3 హెచ్.పి, 10.1 ఎన్.ఎం టార్క్ తో అందుబాటులోకి వస్తుంది. యుబిఎస్ సిస్టెం ఒక్కటే కొత్తగా వస్తుండగా మిగతా పార్టులన్ని నాన్ యుబిఎస్ పార్టులతో వస్తుంది.


బైక్ రైడింగ్ లో సరికొత్త అనుభూతిని ఇచ్చే యమహా వాహన దారులకు మంచి ప్రయాణపు సౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇక కొత్తగా రానున్న యమజా సెలుటో ఆరెక్స్, సెలుటో 125 బైకులు మైలేజ్ బైక్స్ గా కూడా అందుబాటులోకి వస్తున్నాయి. 2019 ఏప్రిల్ కల్లా ఈ బైకులు రిలీజ్ కానున్నాయి.   


మరింత సమాచారం తెలుసుకోండి: