భార‌త‌దేశ ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతి సుజుకీకి ప్ర‌తికూల ప‌రిస్థితులు కొన‌సాగుతున్నాయి. వరుసగా ఐదో నెల అయిన జూన్‌‌లోనూ ప్రొడక్షన్‌‌కు కోత పెట్టింది. గడిచిన నెలలోనూ సంస్థ ఉత్పత్తిని తగ్గించుకుంది. సూపర్‌‌ క్యారీ ఎల్సీవీ సహా అన్ని వాహనాల ప్రొడక్షన్‌‌ను 15.6 శాతం తగ్గించి 1.11 లక్షల యూనిట్లకు పరిమితం చేసింది. ఏప్రిల్‌ నెలలో 10 శాతం ఉత్పత్తిని తగ్గించుకున్న సంస్థ..ఆ మరుసటి నెలలోనూ 18 శాతం కోత విధించింది. మార్చి నెలలో 20.9 శాతం కోత విధించిన సంస్థ.. ఫిబ్రవరిలోనూ 8 శాతం తగ్గించింది. 


ఆల్టో వంటి మినీ సెగ్మెంట్‌‌ వాహనాల ఉత్పత్తిని 48.2 శాతం తగ్గించి 15,087 యూనిట్లకు పరిమితం చేసింది. గత ఏడాది జూన్‌‌లో 29,131 యూనిట్లను తయారు చేసింది. వేగన్‌‌ ఆర్‌‌, స్విఫ్ట్‌‌, డిజైర్‌‌ వాహనాల ఉత్పత్తిని 1.46 శాతం తగ్గించి 66,436  యూనిట్లకు పరిమితం చేసింది. గత ఏడాది జూన్‌‌లో 67,426 యూనిట్లను తయారు చేసింది. యుటిలిటీ వెహికిల్స్‌‌ ఉత్పత్తిని 5.26 శాతం తగ్గించి 17,074  యూనిట్లకు కుదించుకుంది. గత ఏడాది జూన్‌‌లో 18,023  యూనిట్లను తయారు చేసింది. ఇక వ్యాన్ల ఉత్పత్తిని 27.87 శాతం తగ్గించి 8,501 యూనిట్లకు పరిమితం చేసింది. గత ఏడాది జూన్‌‌లో 11,787  యూనిట్లను తయారు చేసింది. ఇక మేలో వాహన ఉత్పత్తిని 18 శాతం తగ్గించింది. ఏప్రిల్‌‌లో  10 శాతం ఉత్పత్తి , మార్చిలో 20.9 శాతం, ఫిబ్రవరిలో ఎనిమిది శాతం తగ్గించింది. మహీంద్రా, టాటా మోటార్స్‌‌ కూడా తయారీని తగ్గించాయి.


ఆర్థిక రంగం అంతంత మాత్రంగానే ఉండటం, మరోవైపు వడ్డీరేట్లు గరిష్ఠ స్థాయిలో కొనసాగుతుండటంతో ఈ ఏడాది తొలి నెల నుంచి ఆటోమొబైల్‌ సంస్థలు అమ్మకాల విషయంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. మారుతి సుజుకీతోపాటు మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటర్స్‌లు కూడా డిమాండ్‌ లేమితో ఉత్పత్తిని తగ్గించుకుంటున్నట్లు ఇదివరకే ప్రకటించాయి. మే నెలలో మొత్తం ప్యాసింజర్‌ వాహన విక్రయాలు 18 ఏళ్ల‌ కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. సెప్టెంబర్‌ 2001 తర్వాత వాహన విక్రయాలో ఇంతటి స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. మిగతా నెల లో నమోదైన అమ్మకాలు ఇంతకంటే తక్కువ స్థాయిలో ఉన్నాయి. గడిచిన నెలకుగాను పూర్తిస్థాయి వాహన విక్రయాలను దేశీయ వాహనదారుల ఉత్పత్తి సంఘం(సియామ్‌), ఫాడాలు ఇంకా విడుదల చేయలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: