హ్యుండై నుండి కొత్త ఎలెక్ట్రిక్ కారు రిలీజైంది. హ్యుండై నుండి ఎలెక్ట్రిక్ వెహికల్ గా వస్తున్న కోనా ఎస్.యు.వి విభాగంలో వస్తుంది. హ్యుండై కోనాను నోయిడాలో బుద్ద్ ఇంటర్నేషన సర్ క్యూట్ లో నిర్వహించిన ఈవెంట్ లో రిలీజ్ చేశారు. ఒక వేరియెంట్ తో మాత్రమే హ్యుండై కోనా అందుబాటులో ఉంది.


ఇండియాలో ఈ కారు 25.30 లక్షల ఎక్స్ షోరూం ప్రైజ్ తో వస్తుంది. హ్యుండై నుండి వచ్చిన ఫస్ట్ ఎలెక్ట్రిక్ కారు కోన. ఇది అధునాతన టెక్నికల్ అప్డేట్స్ తో అంతర్జాతీయ ప్రమాణాలతో డిజైన్ చేయబడింది. ఇండియాలో ఎలెక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలని ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది. అందుకే ఎలెక్ట్రిక్ వెహికల్స్ కొనే వినియోగదారులకు వడీ రేట్లను కూడా తగ్గించారు.  


హ్యుండై కోనా వెహికల్ ఒకసారి చార్జ్ చేస్తే 452 కిలోమీటర్లు వరకు తిరిగొచ్చు. కొన ఎలెక్ట్రిక్ కారు పరిమాణం 4.2 మీటర్లు పొడవు ఉంది. 5 సీట్ల కాన్ఫిగరేషన్ తో సన్ రూఫ్ తో ఇంది అందుబాటులోకి వస్తుంది. ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే 19 గంటల పాటు బ్యాటరీ నడుస్తుంది. మరి కొత్తగా కారు కొనాలనుకునే వారు హ్యుండై ఎలెక్ట్రిక్ కారుని ట్రై చేసి చూడండి.  



మరింత సమాచారం తెలుసుకోండి: