మారుతి సుజుకి కష్టమర్స్ కు గుడ్ న్యూస్.. మారుతి అఫిషియల్ డీలర్ షిప్ అరెనా ఆగష్టు 2019 బిగ్ ఆఫర్ ప్రకటించింది. మారుతి సుజుకి కొన్ని వెహికల్స్ మీద ఊహించని విధంగా ప్రైజ్ తగ్గించడం విశేషం. మారుతి సుజుకి సెలెరియో 60,000 దాకా డిస్కౌంట్ ఇస్తుంది. సి.ఎన్.జి మోడల్ మీద ఈ భారీ డిస్కౌంట్ ప్రకటించారు.     


మారుతి సుజుకి ఆల్టో కె10 మీద కూడా 55,000 రూపాయల భారీ డిస్కౌంట్ ప్రకటించారు. పెట్రోల్ వెహికల్ మీద 55,000, సి.ఎన్.జి వెహికల్ మీద 50,000 రూపాయలు డిస్కౌంట్ ప్రకటించారు. ఇక మారుతి సుజుకి డిజైర్ పై కూడా 55,000 రూపాయల భారీ డిస్కౌంట్ ఎనౌన్స్ చేశారు.  


మారుతి సుజుకి స్విఫ్ట్ 50,000 ధర తగ్గించగా.. సుజుకి ఆల్టో పై 45,000 రూపాయల దాకా ధర తగ్గించడం జరిగింది. మారుతి సుజుకి విటార బ్రీజా వెహికల్ మీద 45,000 బెనిఫిట్స్ ప్రకటించారు. వాగనార్ మీద కూడా 20,000 రూపాయల దాకా ప్రైజ్ తగ్గించారు. తగ్గిన మారుతి సుజుకి కార్ల ధరలు కష్టమర్లను మరింత ఎట్రాక్ చేస్తాయని చెప్పొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: