మార్కెట్ లో కొత్తగా రిలీజ్ అవుతున్న కార్లకు మంచి గిరాకి ఉంటుంది. అనుకున్నట్టుగానే మారుతి సుజుకి నుండి వచ్చిన వాగన్ ఆర్ న్యూ వర్షన్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూలై నెలలో అత్యధిక యూనిట్లు అమ్ముడైన కార్ల లిస్ట్ లో మారుతి సుజుకి వాగన్ ఆర్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. జూన్ తో పోల్చుకుంటే వాహనాల అమ్మకాలు జూలైలో తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. దాదాపు ముందు నెల కన్నా 30 శాతం తక్కువ వహానాలు అమ్ముడయ్యాయట.


జూలై నెలలో 15062 వాగన్ ఆర్ లు అమ్ముడయ్యాయని తెలుస్తుంది. ఇక ఈ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ ఆక్రమించిన వెహికల్ మారుతి సుజుకి డిజైర్. జూలై లో 12,923 యూనిట్లు మారుతి సుజుకి డిజైర్ వెహికల్స్ అమ్ముడయ్యాయి. ఇక థర్డ్ ప్లేస్ లో కూడా మారుతి సుజుకి వెహికల్ స్విఫ్ట్ ఉంది. జూలై నెలలో 12,677 యూనిట్స్ అమ్ముడయ్యాయట.


ఇక 3వ స్థానంలో మారుతి సుజుకి ఆల్టో ఉండగా.. జూలైలో 11,577 ఆల్టో వెహికల్స్ సేల్ అయ్యాయి. ఆ తర్వాత నాల్గవ స్థానంలో మారుతి సుజుకి బలెనో ఉంది. 10,482 వెహికల్స్ జూలై నెలలో సేల్ అయ్యాయి. ఆ తర్వాత 9,814 యూనిట్ సేల్స్ తో మారుతి సుజుకి ఈకో వెహికల్ 6వ స్థానంలో ఉంది. 7వ స్థానంలో హ్యుందై వర్నా (9150 యూనిట్స్), 8వ స్థానంలో మళ్లీ మారుతి సుజుకి ఎర్టిగా 9080 వెహికల్స్ సేల్స్ తో ఉంది. ఇక 9వ ప్లేస్ లో హ్యుందై ఎలైట్ ఐ20 ఎరౌండ్ 9 వేల వెహికల్స్ సేల్స్ చేశాయి. ఇక 10వ స్థానంలో హ్యుందై క్రెటా 6,585 యూనిట్ సేల్స్ కలిగి ఉంది. మొత్తానికి జూలైలో అన్నిటికన్నా మారుతి వెహికల్స్ ఎక్కువగా అమ్ముడయ్యాయని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: