ఇండియాలో అత్యధిక వాహనాలు అమ్ముడయ్యే హ్యుండై త్వరలో సరికొత్త ఎంవిపి మోడల్ ను లాంచ్ చేయబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే మారుతి సుజుకి ఎర్టిగా ఎంవిపి మోడల్ లో మంచి సేల్స్ కలిగి ఉంది. అంతేకాదు ఇక్కడ కష్టమర్స్ ఎంవిపి మోడల్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం వల్ల హ్యుండై నుండి కూడా అలాంటి మోడల్ ఒకటి రెడీ చేయబోతుంది. 2012 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించబడిన హెక్సా స్పేస్ ఎంవిపిని మళ్లీ అధునాతన టెక్నికల్ అప్డేట్స్ తో హ్యుండై తిరిగి లాంచ్ చేయాలని చూస్తుంది.   


హ్యుండై క్రెటా కూడా అప్గ్రేడ్ చేస్తున్నారు. మార్కెట్ పరిస్థితి బాగున్న టైంలో హ్యుండై క్రెటా కొత్త మోడల్ ను లాంచ్ చేస్తుందట. 2020 లో క్రెటా కొత్త మోడల్ రావొచ్చని అంచనా. బిఎస్-6 ఇంజిన్ తో ఈ వెహికల్ వస్తుంది. రీసెంట్ గా హ్యుండై నుండి ఐ10 నియోస్ లాంచ్ చేశారు. 


హ్యుండై నుండి రీసెంట్ గా వెన్యూ, ఐ10 నియోస్ వెహికల్స్ లాంచ్ అయ్యాయి. ఇక ఈ రెండిటి తర్వాత వచ్చే ఏడాది క్రెటా ఫేస్ లిఫ్ట్ వెహికల్ లాంచ్ చేస్తారట. ఇక హ్యుండై ఎంవిపి మోడల్ 2021లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయట.  



మరింత సమాచారం తెలుసుకోండి: