హెచ్ డి  టీవీ లో మనకు కావాల్సిన ప్రోగ్రామ్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే ఆ కిక్కే వేరప్పా.  అయితే తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం తో టీవీ ప్రియులకి ఇంకాస్త కిక్ రాబోతుంది.కొత్త టెక్నలాజి తో వచ్చిన టీవీ ల్లో మీకు నచ్చిన క్రికెట్ చూస్తుంటే మీ ముందు మ్యాచ్ జరుగుతున్న ఫీలింగ్ ఉంటుంది. కానీ మంచి టీవీ లు కొనాలంటే ధరలు ఆకాశాన్నంటుతాయి అంటారా... మరేం పర్వాలేదు కేంద్రం కొత్త నిర్ణయం తో టీవీ ధరలు భారీగా తగ్గనున్నాయి టీవీ లు తయారు చేసేందుకు ఉపయోగించే టీవీ ప్యానళ్లను దిగుమతి చేసుకునే కస్టమ్స్ సుంకాన్ని 5 శాతానికి తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో టీవీ ధరలు భారీగా తగ్గనున్నాయి. కాగా ఎల్ సీడి, ఎల్ ఈడి టీవీ లు  తయారు చేయటానికి సగం ఖర్చు ఈ ప్యానళ్లపై వెచ్చించాల్సి ఉంటుంది. టీవీ ల తయారీలో ఈ ఓపెన్ సెల్ ప్యానెల్ అతి ముఖ్యమైనది కాబట్టి ఈ ప్యానెల్ దిగుమతి శుంకాన్ని తగ్గించటం  తో టీవీ ల ధరలు  కూడా తగ్గే అవకాశం ఉంది.

 

 

అయితే గతంలో 7.5 శాతం ఉన్న ఎల్ ఈడీ, ఎల్ సీడీ టీవీ ల ఓపెన్ సెల్  ప్యానళ్ల కస్టమ్స్ డ్యూటీని కేంద్రం 15 శాతానికి  పెంచింది. దీంతో టీవీ ల ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం తాజా నిర్ణయం టీవీ ప్రియులకి తీపిలాబురులా మారనుంది. 15 శాతానికి పెంచిన కస్టమ్స్ డ్యూటీని  ఇప్పుడు భారీగా తగ్గించి  5 శాతానికి తగ్గించారు. దేశీయ  తయారీ రంగాన్ని ప్రోత్సహించి  వృద్ధి చేయాలనే ఉద్దేశం తోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది.ఈ మేరకు   ఎల్ సీడీ, ఎల్ ఈడీ టీవీ ల ధరలు భారీగా తగ్గనున్నాయని వెల్లడించింది.ఇది ఏమైనా టీవీ ప్రియులకి కేంద్రం నిర్ణయం తీపికబురు కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: