సెప్టెంబర్ 1న కేంద్రం అమలు చేసిన కొత్త మోటార్ వాహనాల చట్టాన్ని ఎత్తివేయాలంటూ నిరసనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. భారీగా జరిమానాలు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులను ట్రాఫిక్ సిగ్నల్స్ ని సరి చేయకుండానే కొత్త మోటార్ చట్టం ద్వారా ఇంత భారీ జరిమానాలు ఎలా విధిస్తారు అంటూ వాహనదారులు కేంద్రాన్ని  ప్రశ్నిస్తున్నారు. అయితే వాహనదారుల నిరసన పై స్పందించి దేశ ప్రజల ప్రాణాలను కాపాడాలనే  ఉద్దేశంతోనే ఈ కొత్త మోటార్ చట్టాన్ని తీసుకు వచ్చామని... ఆదాయం కోసం కాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఈ భారి జరిమానాలపై వాహనదారులు పెదవి విరుస్తున్నారు. కాగా  కొన్ని కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్ర పరిధిలో కేంద్రం అమలు చేసిన ఈ కొత్త చట్టాన్ని అమలు చేయకుండా జరిమానాలు తగ్గిస్తున్న విషయం తెలిసిందే. 

 

 

 అయితే ఈ భారీ జరిమానాలు పై పలుచోట్ల వాహనదారులు ఇప్పటికే నిరసన వ్యక్తం చేయగా... ఇప్పుడు ఈ నిరసన సెగలు దేశ రాజధాని ఢిల్లీకి తగిలాయి. కేంద్రం తీసుకొచ్చిన నూతన మోటార్ వెహికల్ చట్టం ద్వారా విధిస్తున్న భారీ జరిమానాలను  నిరసిస్తూ.... దేశ రాజధాని ఢిల్లీలో ట్రాన్స్పోర్ట్ యూనియన్లు సమ్మెకు పిలుపు నిచ్చాయి. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి పోయి... ఢిల్లీలో రవాణా వ్యవస్థ స్తంభించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్స్ (యుఎఫ్ టిఏ) సమ్మెకు పిలుపునివ్వడంతో... టాక్సీలు,  ఆటోలు,  క్యాబ్ లు,  ఇలా అన్ని సేవలు నిలిచిపోగా ప్రయాణికులు అవస్థలు  పడుతున్నారు, ఈ సమ్మె నేపథ్యంలో పలు విద్యాసంస్థలు,  స్కూళ్లు  కూడా మూతపడ్డాయి. కేంద్రం అమలు చేసిన భారీ జరిమానాలను సవరణ చేసి తగ్గించాలని...భారీ  జరిమానాల నుంచి తమకు ఉపశమనం కల్పించాలని రవాణా సంఘాల ఐక్య సమాఖ్య డిమాండ్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: