ఈమధ్య జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే లోకం తీరు  ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈరోజుల్లో కామాంధుల చేతిలో బలైపోతున్న మహిళల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. మదమెక్కిన కామందుల వల్ల మహిళలకు కనీస రక్షణ లేకుండా పోతుంది. వావి వరసలు  లేవు చిన్న పెద్ద లేదు. తొమ్మిది నెలల చిన్నారి నుంచి 60 ఏళ్ల ముసలమ్మ వరకు కామాంధులకు బలైపోతున్నారు. దీనిపై ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా... ఈ కామ రాక్షసుల తీరు మాత్రం మారడం లేదు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో చూసాం. ఇప్పుడు మరో ఘటన వెలుగులోకి వచ్చింది. 

 

 

 18 ఏళ్ల యువకుడు కామంతో కళ్లు మూసుకుపోయి 60 ఏళ్ల వృద్దురాలిపై అత్యాచారం చేసాడు . కనీసం ఆమె వయస్సుకు  మర్యాద ఇవ్వకుండా రాక్షసుడిలా  మీద పడ్డాడు. రాజస్థాన్లో  ఈ ఘటన చోటు చేసుకుంది.ఓ  వృద్ధురాలు తన భర్త చనిపోవడంతో కొడుకు ఇంట్లోనే ఉంటుంది. అయితే ఆమెను చూసుకోవడానికి ఓ 18 ఏళ్ల కుర్రాడి ని నియమించాడు ఆమె  కొడుకు. అయితే తన బాగోగులు చూసుకోవడానికి నియమించిన కుర్రాడు చిన్నపిల్లాడే   కదా అని అప్పుడప్పుడు ఆ యువకుడికి  వృద్ధురాలు ఖర్చులకోసం డబ్బులు ఇచ్చేది. దీంతో మాదకద్రవ్యాలకు అలవాటుపడిన యువకుడు రోజు డబ్బులు కావాలని ఆ వృద్ధురాలిని వేధించేవాడు. ఈ నేపథ్యంలో ఓ రోజు డబ్బులు అడిగితే ఇవ్వలేదని మద్యం మత్తులో ఆ వృద్ధురాలిపై లైంగిక దాడికి దిగాడు. దీంతో భయంతో వణికి పోయిన వృద్ధురాలు ఎలాగోలా తప్పించుకుని ఇరుగుపొరుగు వాళ్ళను  పిలిచే సరికి అందరూ వచ్చి ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: