హైదరాబాద్ కి మెట్రో అంటే ఒక ప్రతిష్ట. ఎంతో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ లో మెట్రో నిర్మాణం జరిగింది. కొన్ని వేల కోట్లతో ప్రభుత్వం మెట్రో స్టేషన్ ని పకడ్బందీగా నిర్మించింది . కాలుష్యం, రవాణా సమయం  తగ్గించడానికి ఈ మెట్రో స్టేషన్ ఉపయోగపడుతుందని ప్రభుత్వం తెలిపింది. ట్రాఫిక్ బాధలు లేకుండా సాఫీగా ఈ మెట్రో రైలు ప్రయాణించ వచ్చని ప్రజలు నమ్ముతారు. అయితే ఇప్పుడు జరిగిన సంఘటన చూస్తుంటే ఇవన్నీ అబద్ధాలు అనిపిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో నిర్మాణంలో అవకతవకలు జరిగాయని అనిపిస్తుంది. హైదరాబాద్ లో కురిసిన వర్షానికి స్టేషన్ పై కప్పు పెచ్చులూడి  పడిపోయింది .కాంట్రాక్టర్ల  నిర్లక్ష్యానికి ఓ ప్రాణం బలైపోయింది. 

 

 

 హైదరాబాదులో వర్షం కురుస్తుండటంతో ఓ మెట్రో స్టేషన్ కిందకి  చేరుకుంది ఓ మహిళా . దీంతో మెట్రో స్టేషన్ పైకప్పు పెచ్చులూడి ఆ మహిళపై పడడంతో మహిళలకు తలకు  గాయాలు కావడంతో హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. ఈ ఘటన అమీర్ పేట్  మెట్రో స్టేషన్ లో జరిగింది. దీంతో మెట్రో నిర్మాణం పై ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎన్నో కోట్లు వెచ్చించి నిర్మించిన మెట్రో స్టేషన్లు చిన్నపాటి వర్షాలకు పెచ్చులు ఊడటంతో ... ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఉందని పలువురు భావిస్తున్నారు. అయితే ఈ ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: