ఈ సెప్టెంబర్ లో దేశీయ కార్ల విక్రయాలలో 34శాతం క్షీణత నమోదయ్యింది. గత ఏడాది సెప్టెంబర్ లో 1,97,124 కార్ల విక్రయాలు జరుగగా ఈఏడాది సెప్టెంబర్ లో 1,31,281యూనిట్ల విక్రయాలు మాత్రమే జరుగాయి. ఇక అన్ని కేటగిరీల వాహనాలు కలుపుకొని గత నెలలో 20,04,932 వాహనాలను విక్రయించగా సెప్టెంబర్ 2018లో 25,84,062 వాహనాలను విక్రయించినట్లు సియామ్ వెళ్ళడించింది. ఇదిలా ఉంటే సంక్షోభం నుండి బయటపడేందుకు ఆటో మొబైల్ సంస్థలు అనేక ప్రయత్నాలు చేస్తున్న పెద్దగా ఫలితం కనిపించడం లేదు. పండగ సీజన్ సందర్భంగా తదితర వాహనాల పై భారీగా భారీగా డిస్కౌంట్ లను ప్రకటిస్తూ వాహనదారులను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా కూడా పెద్దగా వాహన విక్రయాలు జరుగడం లేదు.