స్కూటర్స్ విభాగంలో ఒకప్పటి రారాజు అంటే బజాజ్ స్కూటర్స్.. బజాజ్ చేతక్ స్కూటర్స్ ఓ విధంగా బజాజ్ యొక్క బ్రాండ్ ను పెంచిందని చెప్పొచ్చు. ఇప్పుడంటే వివిధరకాల స్కూటర్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి కాని స్కూటర్ అనగానే మొదటగా గుర్తొచ్చేది బజాజ్ చేతక్ స్కూటర్ మాత్రమే.


మార్కెట్ లో కొత్త తరహా స్కూటర్స్ అందుబాటులోకి రావడంతో 14 ఏళ్ల క్రితమే బజాజ్ చేతక్ స్కూటర్స్ తయారు చేయడం ఆపేసింది. అయితే మళ్లీ కస్టమర్స్ యొక్క ప్రాధాన్యత దృష్ట్యా బజాజ్ చేతక్ స్కూటర్స్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తుంది. ఈమధ్యనే బజాజ్ చేతక్ స్కూటర్స్ మార్కెట్ లోకి వచ్చాయి.


ప్రస్తుతం రాబోతున్న చేతక్ స్కూటర్స్ అన్ని ఎలక్ట్రిక్ వాహనాలుగా వస్తున్నాయి. రానున్న రోజుల్లో అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ గా మారే అవకాశం ఉంది. అందుకే ఎలక్ట్రిక్ వెహికల్ గా బజాజ్ చేతక్ స్కూటర్ వస్తుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ధర లక్ష రూపాయల వరకు ఉండొచ్చని అంచనా. మార్కెట్ లోకి రాబోతున్న ఈ సరికొత్త చేతక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మరోసారి పూర్వ వైభవాన్ని అందుకుంటాయో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: