పండుగ వచ్చింది అంటే ఆఫర్లతో కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేయడం మోటార్ కంపెనీలకు అలవాటే. 2, 3, 4 వీలర్స్ అన్ని విభాగాల్లో పండుగ ఆఫర్లు ప్రత్యేకం కానున్నాయి. రూపాయి కట్టకుండా కూడా కోరుకున్న బైక్ ఇంటికి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఫెస్టివల్ ఆఫర్ కింద జీరో డౌన్ పేమెంట్ తో కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నారు మోటార్ కంపెనీలు.


ఇక ఈ క్రమంలో కొత్తగా ఎలెక్ట్రిక్ వెహికల్స్ కూడా ఇదే మంచి తరుణమని భావించి అవి కూడా జీరో డౌన్ పేమెంట్ తో ఇస్తున్నారు. ఇప్పటికే ఎలెక్ట్రిక్ స్కూటర్స్ మార్కెట్ లోకి రిలీజ్ అవగా బాట్ రే (BattRE) నుండి వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ దీవాళి సందర్భంగా జీరో డౌన్ పేమెంట్ తో స్కూటర్ అందుబాటులో ఉంచుతుంది.  


ఈ ఇయర్ జూన్ లో రిలీజైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ 250 వాల్ట్స్ BLDC మోటార్ తో 48V 30AH ఇయాన్ లిథియం బ్యాటరీతో వస్తుంది. 25 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో వస్తున్న ఈ బైక్ ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే 90 కిలోమీటర్ల వరకు వస్తుంది. ఇక ఈ స్కూటర్ ధర 70,000 లుగా నిర్ణయించారు. దీనితో పాటుగా బాట్ రే నుండి ఇయాన్ లిథియం పెడల్ అసిస్టెంట్ బైక్ కూడా రిలీజ్ చేశారు. న్యూట్రాన్ గా వస్తుంది. ఈ వెహికల్ 39,000 ల ఎక్స్ షోరూం ప్రైజ్ తో వస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: