జావా మోటార్ సైకిల్స్ నుండి లేటెస్ట్ గా జావా యానివర్సరీ ఎడిషన్ బైక్ రిలీజ్ చేసింది. 90 సంవత్సరాల జావా బ్రాండ్ ప్రస్థానం సందర్బంగా ఈ యానివర్సరీ ఎడిషన్ బైక్ రిలీజ్ చేస్తుంది. జావా నుండి వస్తున్న ఈ బైక్ ధర 1.73 లక్షలు ఎక్స్ షో రూమ్ ప్రైజ్ తో వస్తుంది. అయితే యానివర్సరి ఎడిషన్ బైక్ కూడా కేవలం 90 మంది కస్టమర్స్ కే అని అంటున్నారు.

 

90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా మొదటి 90 మందికే ఈ బైక్ సొంతం చేసుకునే అవకాశం ఇస్తున్నారు. ఇక ఈ బైక్ 293 సిసి కెపాసిటి తో ఎయిర్ కూల్డ్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. 6 గేర్స్ తో పాటుగా 26 బిహెచ్పి పవర్,  28 టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

 

అక్టోబర్ 11 నుండి 22 వరకు ఈ బైక్ బుకింగ్స్ జరిగాయి. వారిలో లక్కీ డ్రా ద్వారా మొదటి 90 మందికి మాత్రమే జావా యానివర్సరీ ఎడిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం జావా నుండి రెండు మోడల్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. అవి బుకింగ్ చేశాక 6 నెలల వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: