టెక్నలాజి మారుతున్న కొద్దీ చాలా రకాల సులువైన పరికరాలు రోజు రోజుకు  మార్కెట్లో పెరుగుతూనే ఉన్నాయి. కొత్త ఫీచర్స్, కొత్త రకం హంగులతో చాలా రకాలు మార్కెట్లో నిత్యం వస్తూ సందడి చేస్తున్నాయి. వాణిజ్య రంగంలో చాలా రకాల కొత్త నార్లు మార్కెట్ లోకి వస్తున్నాయి. ప్రస్తుతం రోడ్ యాసెడెంట్ లో చాలా మంది ప్రాణాలను కోల్పోయిన వారు  చాలా మందే ఉన్నారు. అలాంటి వాటిని కొంచమైనా తగ్గించడానికి కంపెనీలు కొత్త టెక్నాలిజీ ని రుచి చూపిస్తున్నారు. 


ఇకపోతే వోక్స్ వేగన్ కార్లలో రానున్న సంవత్సరానికి కొత్త రకం మార్కెట్లో కి రానున్నాయి.  క్యాబిన్ ను బటన్ లెస్ గా ఉండేలా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ కార్లను హైబ్రిడ్ వేరియంట్లలో తీసుకొస్తున్నారు. ఈ కొత్త రకం కార్లలో చాలా రకాల ఫీచర్లు కూడుకొని ఉన్నవి. అందుకే మార్కెట్లోకి రాక ముందే ఈ కార్లకు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. ప్రాణాల మీద ఎవరికీ ఆశ ఉండదు. అందుకే డబ్బులు కన్నా ముఖ్యం ప్రాణాలు అని కొత్త టెక్నాలజీ ఉన్న కార్లను ఎక్కువగా కొనడానికి  మొగ్గు చూపుతున్నారు. 


మామూలు కార్లకు ఈ కార్లకు ఉన్న వ్యత్యాసాల విషయానికొస్తే.. 26 మీ .మీ పొడవును పెంచారు. 4 , 284 పొడవును పెంచారు. అదే విదంగా వెడల్పు కొద్దిగా తగ్గించారు. డబల్ బ్యారెల్ ఎల్ ఈడీ లైట్లతో కొత్త హంగులతో ఈ కొత్త కారును మరింత ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు. ఎయిర్ డ్యామ్, బాడీ కలర్డ్ కూడా కొత్తగా మార్చారు..దానితో ఈ కార్లు ప్రమాదాలను పూర్తిగా ముందే కనిపెట్టే విదంగా ఉండి ప్రమాదాలను జరగ కుండా ఆపుతాయట. 


మరో విశేషమేంటంటే.. శామ్‌సంగ్‌లోని కొన్ని స్మార్ట్‌ఫోన్‌ మోడళ్లను దీనికి అనుసంధానించే సౌకర్యం ఉంది. డోర్‌ని తెరవడం, ఇంజిన్‌ స్టార్ట్‌ చేయడానికి ఫోన్‌ని 'కీ'గా వాడుకోవచ్చు. మొత్తం ఐదు వేరియంట్లలో మూడింటిని 48వోల్ట్‌ మైల్డ్‌ హైబ్రిడ్‌ సిస్టంతో పాటు టీఎస్‌ఐ పెట్రోల్‌ ఇంజిన్‌ని సంధానం చేశారు. ఒక లీటర్‌ టర్బో త్రీ సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌, 114బీహెచ్‌పీ, 148బీహెచ్‌పీ శక్తిని విడుదల చేసేలా 1.5లీటర్‌ టర్బో ఫోర్‌ సిలిండర్‌ ఇంజిన్‌లు మరియు 114బీహెచ్‌పీ, 148బీహెచ్‌పీ శక్తిని విడుదల 2లీటర్‌ డీజిల్‌ ఫోర్‌ సిలిండర్‌ వేరియంట్లు కూడా ఈ కార్లకు అమర్చి ఉంటాయట.  


మరింత సమాచారం తెలుసుకోండి: