యురోపియన్ కు చెందిన టూ వీలర్ దిగ్గజం ఫ్యూజో మోటర్ సైకిల్స్ ను 100 శాతం కొనుగోలు చేసింది మహీంద్ర. ఫ్యూజో మోటార్ సైకిల్స్ ను 2015లో 51 శాతం వాట కొన్న మహీంద్రా ఇప్పుడు పూర్తిగా కంపెనీని చేజిక్కించుకుంది. ఫ్రెంచ్ మోటార్ సంస్థ పి.ఎస్.ఏ గ్రూపు దగ్గర ఉన్న ఫ్యూజో మిగిలిన శాతాన్ని 13 లక్షల పౌండ్లు అంటే మన కరెన్సీలో చెప్పలంటే 109 కోట్ల రూపాయలు ఇచ్చి కొన్నారు.  


ఫ్యూజో కంపెనీపై పెట్టుబడి పెట్టగా మార్కెట్ లో సానుకూల ఫలితాలు వస్తున్నాయని అందుకే ఆ మోటార్ కంపెనీ యొక్క మొత్తాన్ని సొంతం చేసుకుంది మహీంద్ర. యురోపియన్ మార్కెట్ లో ఫ్యూజో స్కూటర్స్, బైకులకు మంచి డిమాండ్ ఉంది. ఫ్యూజో స్కూటర్ 55 సిసి తో వస్తున్న కిస్బీ బెస్ట్ సెల్లింగ్ మోడల్ అని తెలుస్తుంది.


ఆసియా మార్కెట్ లానే యురోపియన్ మార్కెట్ లో కూడా పట్టు సాధించేందుకు ఫ్యూజో 100 శాతం వాటా సొంతం చేసుకుంది మహీంద్రా. 2021 కల్లా 7 సరికొత్త ఫ్యూజో వెహికల్స్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ఫ్యూజో బైకులు ఇండియా మార్కెట్ లోకి ఎప్పుడు తెస్తారో అన్నది వివరణ ఇవ్వలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: