అయోధ్య కేసు విషయంలో సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే.. ఈ తీర్పుపై పలువురు ప్రముఖులు స్పందించారు. ఈ తీర్పును ఎవరి గెలుపోటముల అంశంగానూ చూడొద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పునివ్వనున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి హిందీలో వరుసగా మూడు ట్వీట్లను ఆయన చేశారు. 


‘‘అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు వస్తోంది. గత కొద్ది నెలలుగా ఈ కేసుపై సుప్రీం కోర్టు తరచుగా వాదనలు విన్నది. ఈ సమయంలో సమాజంలోని అన్ని వర్గాల వారు  సద్భావనతో మెలిగేందుకు చేసిన ప్రయత్నాలు ప్రశంసనీయమని అయన కొనియాడారు.మత సామరస్యపరమైన పోస్టులు పెట్టకూడదని తెలిపారు. అయోధ్యపై ఎలాంటి తీర్పు వచ్చినా అది ఎవరి గెలుపు, ఓటములకు సంబంధించిన విషయం కాదని పేర్కొన్నారు. దేశంలో శాంతి, సామరస్యపూర్వక, సానుకూల వాతావరణాన్ని నెలకొల్పేందుకు.. సమాజంలోని అన్ని వర్గాలూ చేసిన కృషి స్వాగతించదగ్గది. కోర్టు తీర్పు తర్వాత కూడా మనమంతా కలిసి ఇదే సామరస్యాన్ని కొనసాగించాలని తెలిపారు. 


దశాబ్దాల కాలం పాటు వివాదాలు, పోట్లాటలు, న్యాయస్థానాల మధ్య నలిగిన రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీం కోర్టు చారిత్రాత్మకమైన తీర్పును వెల్లడించింది. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామజన్మభూమి న్యాస్‌కు అప్పగించాలని, అప్పటి వరకు ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని సంచలన తీర్పు ఇచ్చింది.


అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పును వెలువరిస్తున్న నేపధ్యంలో మహారాష్ట్రలోని ధులే జిల్లాకు చెందిన 56 ఏళ్ల వ్యక్తి ఫేస్‌బుక్‌లో వివాదాస్పద పోస్టు పెట్టారు. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధులే జిల్లాలోని ఓల్డ్ ఆగ్రా రోడ్డు నివాసి తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో వివాదాస్పద పోస్టు పెట్టారు. సోషల్ మీడియాపై నిఘా వేసిన అధికారులు ఈ పోస్టును కనుగొన్నారు. ఈ నేపధ్యంలో అతనిని అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు పోలీసులు.



మరింత సమాచారం తెలుసుకోండి: