మునుపెన్నడూ.. లేని విధంగా తెలంగాణ పోలీసు యంత్రాంగం శనివారం విషమ పరీక్షలను ఎదుర్కొంది. శనివారం వివాదాస్పదంగా మారిన అయోధ్య తీర్పు ఓ వైపు, ఆర్టీసీ కార్మికులు చలో ట్యాంక్‌బండ్‌ మరోవైపు.. పోలీసు యంత్రాంగాన్ని కంటిమీద కునుకు లేకుండా చేసింది. అయోధ్య తీర్పుపై స్పష్టత రావడంతో శుక్రవారం రాత్రి 9గంటల నుంచి రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. శనివారం ట్యాంక్‌బండ్‌ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రతి విషయంలో సమన్వయం చేసుకుని అనుక్షణం పహారాలో ఉండి అవాంఛనీయ ఘటనలు లేకుండా జాగ్రత్తపడింది.


రాత్రి నుంచే అన్ని జిల్లా ఎస్పీలు, కమిషనర్‌లతో డీజీపీ చర్చలు జరిగాయి. చలో ట్యాంక్‌బండ్‌ నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు, తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలను పోలీసులు శుక్రవారం రాత్రి నుంచే హౌస్‌ అరెస్టులు చేశారు. అదే విధంగా గ్రామాల వారీగా జల్లెడ పట్టి ఆర్టీసీ కార్మికులను సైతం అరెస్టు చేసి చలో ట్యాంక్‌బండ్‌ను నిలువరించే ప్రయత్నం చేశారు. శనివారం ట్యాంక్‌బండ్‌ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు మినహా... రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలు ఎక్క డా చోటుచేసుకోకపోవడంతో పోలీసు శాఖ ఊపిరి పీల్చుకుంది.


ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన చలో ట్యాంక్‌బండ్‌ ఉద్రిక్తలకు దారితీసింది. దీంతో సీటీ పోలీస్‌ కమిషనర్‌తో పాటు రాచకొండ, సైబరాబాద్‌ పోలీసులకు శుక్రవారం నుంచే కంటిమీద కునుకు లేదు. జేఏసీ నాయకులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్‌ చేశారు.   


అదే సమయంలో  కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పును శనివారం ఉదయం వెల్లడించనున్నట్లు శుక్రవారం రాత్రి 9గంటలకు సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పెట్టింది. దీంతో దేశమంతా ఒక్కసారిగా అప్రమత్తమైంది. కేంద్ర హోంశాఖ, నిఘా వర్గాలు రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేశాయి. త్వరితగిన అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసుల కమిషనర్లతో డీజీపీ మహేందర్‌రెడ్డి టెలీ కాన్ఫరెన్స్‌ న్విహించారు. అన్ని జిల్లాల కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ల నుంచి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: