రోజంతా కష్టపడి నెలకు పది వేయిల వరకు సంపాదించే సామాన్యునికి స్వంతగా ఓ బైక్ కొనుక్కోవాలని ఆశగా  ఉంటుంది. కాని ఇందుకోసం కనీసం రూ 25000 వరకు జీతం ఉంటేగాని లోన్ రాదు. అప్పు చేసుకుని కొందామంటే వచ్చే జీతం కనీస అవసరాలకే సరిపోదు. ఇలాంటి పరిస్దితుల్లో తనకు అనుకూలంగా ఏదైన బ్యాంక్ లోను ఇస్తే బాగుండు అని అనుకుంటాడు. ఇలాంటి వారి కోసమే ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మంచి ఆఫర్ అందిస్తుంది.


కొత్త బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేయాలనే మీకలను నిజం చేస్తామని ముందుకు వస్తుంది. అందుకు గాను ఈ ప్రైవేట్ రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు టూవీలర్ లోన్స్ అందిస్తోంది.. ఇకపోతే ఇందుకు గాను మీరు ఉద్యోగం చేస్తుండాలి. లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా ఈ రుణానికి అర్హులే. ఇక వయసు విషయానికి వస్తే 21 నుంచి 65 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఉద్యోగం చేసే వారు సంవత్సరానికి రూ.84,000 స్థూల ఆదాయం కలిగి ఉండాలి.


అంటే ఈ జీతాన్ని నెల చొప్పున లెక్కవేసుకుంటే నెలకు మీ సంపాదన రూ.7,000 ఉన్నా సరిపోతుంది. అదే స్వయం ఉపాధి పొందుతున్న వారి వార్షిక స్థూల ఆదాయం రూ.72,000 ఉండాలని చెబుతున్నారు బ్యాంకు అధికారులు. ఇక ఈ విధానంలో 100 శాతం ఫైనాన్స్ సౌకర్యం ఉంది. కాని ఇది ఎంపిక చేసిన మోడళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ లోన్ ఖర్చులను గమనిస్తే లోన్ ప్రాసెసింగ్ ఫీజు 3 శాతం. డాక్యుమెంటేషన్ చార్జీలు కూడా 2 శాతంగా ఉండగా, ప్రిపేమెంట్ చార్జీలు అదనంగా ఉంటాయి.


ఇక లోన్‌పై వడ్డీ రేటు 10.4 శాతం నుంచి ప్రారంభమౌతుంది. ఇకపోతే ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ వంటి డాక్యుమెంట్లు  లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే అవసరం అవుతాయి. దీంతో పాటుగా లేటెస్ట్ శాలరీ స్లిప్, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) వంటి డాక్యుమెంట్లు కూడా కావాలి. ఇక బైక్ కోసం తీసుకున్న రుణాన్ని 12 నెలల నుంచి 48 నెలల లోపు తిరిగి చెల్లించాలి. ఇదే కాకుండా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు ప్రత్యేక డిస్కౌంట్ సౌకర్యం కూడా ఉందంటున్నారు సంస్ద నిర్వాహకులు.



మరింత సమాచారం తెలుసుకోండి: