సిద్ శ్రీరామ్.. పేరు వినగానే గుర్తుకు వచ్చే పాట (నాని కథానాయకుడిగా, నివేదా థామస్ కథానాయికగా నటించిన చిత్రంలో  అడిగా..అడిగా సాంగ్. అనతి కాలంలోనే పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న సింగర్ అనే చెప్పాలి . ఈ కాలంలో ప్రతీ ఒక్కరికీ తెలిసిన క్రేజీ సింగర్. పాడిన ప్రతీ పాట.. ఓ సెన్సేషనే. తన గాత్రంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ చెన్నై కుర్రోడు.. అతి తక్కువ కాలంలో వైరల్‌గా మారాడు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన అతని గురించె చెప్పుకున్నారు. తాజాగా ఈ యువకుని గూర్చి  ఓ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది.


 గీత గోవిందం సినిమాలోని ఇంకేం ఇంకేం కావాలే పాట పాడి.. ఎంతగా సంచలనం సృష్టించాడో అందరికీ తెలిసిందే... కేవలం ఆ ఒక్క పాటతోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. సిద్ శ్రీరామ్ గాత్రం ప్రత్యేకంగా నిలిచింది. ఈ పాటతో రెండు తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపిన సిద్ శ్రీరామ్ ఆపై టాక్సీవాలా చిత్రంలోని మాటే వినదుగా పాటతో మరోసారి క్రేజీగా మారాడు.


హుషారుతో యూత్ ఫాలోయింగ్.. హుషారు సినిమాలోని ఉండిపోరాదే పాట యూత్‌ను ఏ రకంగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ఎవరి ఫోన్‌లో చూసినా అదే రింగ్‌టోన్ వినిపించేది. స్యాడ్ వెర్షన్ పాట కూడా అంతే ఫేమస్ అయింది. ఇలా వరుస పాటలతో పాపులర్ సింగర్‌గా మారిపోయాడు.


అల్లు అర్జున్ నటించే అలా వైకుంఠ పురంలో.. చిత్రంలో సామజవరగమన అంటూ ఒకే ఒక్క పాటతో సినిమాపై అంచనాలు పెంచేయడం మాములు విషయం కాదు. సామజవరగమన పాటతో ఎన్ని ప్రశంసలు అందుకున్నాడో.. అన్ని విమర్శలు అందుకున్నాడు. తన ఉచ్చారణతో పాట విలువను, తెలుగును కించపరుస్తున్నారని కొంతమంది టార్గెట్ చేశారు. అయినా ఇవేవీ ఆ పాటను ఆపలేకపోయాయి. అత్యధిక మంది ఇష్టపడిన పాటగా యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది ఆ పాట.
తాజాగా మణిరత్నంతో ఏవో చర్చలు జరిగాయని, ఆ క్రమంలో సిద్ శ్రీరామ్ అలిగాడని వార్తలు ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాకుండా ఆ ఫ్రస్ట్రేషన్‌లో అమెరికాకు చెక్కేశాడని, ఎవరు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వడం లేదని టాక్ నడుస్తుంది. ఇదే పద్దతిని కొనసాగిస్తే.. అవకాశాలు తగ్గే ప్రమాదం కూడా ఉందని కొందరు అంటున్నారు. మరి వారిద్దరి మధ్య ఏం జరిగింది? నిజంగానే అంత పెద్ద గొడవ జరిగిందా..? అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.. మరి..!! 


మరింత సమాచారం తెలుసుకోండి: