యూకేలోని న్యూలిన్ హార్బర్‌లో ఓ వింత.. విషాద ఘటన చోటుచేసుకుంది. కార్న్‌‌వాల్‌లోని ఓ తెరచాప పడవలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి.. గురువారం మధ్యాహ్నం ఫ్రిజ్‌లోకి దూరాడు. అతడితో కలిసి పనిచేస్తున్న సిబ్బంది కూడా దీన్ని చూశారు. అయితే, సరదా కోసం ఫ్రిజ్‌లోకి వెళ్లి ఉంటాడని వారు భావించారు. 


తదనంతరం అక్కడినుండి వెళ్లిపోయారు. ఆ వ్యక్తి ఎక్కడా చోటులేనట్లు ఫ్రిజ్‌లోకి దూరి నిద్రపోయాడు. కాగా, అది లాక్ కావడంతో బయటకు రాలేక అతడు అందులోనే శాస్వత నిద్రలోకి జారుకున్నాడు. ఆ తర్వాత తనను చూసిన ఆ సిబ్బంది తమ పనుల్లో పడి అతడి గురించి మరిచిపోయారు. విధులు ముగించుకుని వెళ్లేప్పుడు ఆ వ్యక్తి కనిపించలేదు. 


దాంతో సిబ్బందికి ఆ వ్యక్తి ఫ్రిజ్ లోకి వెళ్లన విషయం గుర్తుకొచ్చింది. దీంతో ఫ్రిజ్ తెరిచేందుకు ప్రయత్నించారు. అది ఎంతకీ తెరుచుకోలేదు. ఈ విషయం తెలియగానే పోర్టు అధికారులు పోలీసులకు ఫోన్ చేశారు. శుక్రవారం తెల్లవారు జామున ఫ్రిజ్‌ను తెరిచి చూసేసరికి ఆ వ్యక్తి చనిపోయి ఉన్నట్లు నిర్దారించారు. లంచ్ తర్వాత కాసేపు కునుకు తిద్దామనే ఉద్దేశంతో ఆ ఫ్రిజ్‌లోకి వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. ఈ సందర్భంగా పోర్టు పరిసరాల్లోని సీసీ టీవీ కెమేరాలను కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు.


చూశారుగా.. ఫ్రెండ్స్.. ఫ్రిజ్‌లోకి దూరడం ఎంత ప్రమాదకరమో.. ఇటీవల కొందరు టిక్‌టాక్ వీడియోల కోసం ఫ్రిజ్‌లో కూర్చుంటున్నారు. ఇంకొందరైతే పిల్లలను సైతం ఫ్రిజ్‌లో కూర్చో పెట్టి వీడియోలు తీస్తున్నారు. సరదా కోసం చేసిన పనులు కూడా ప్రమాదంగా మారుతాయి. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించండి. ఇలా మరెవ్వరూ ఇలాంటి పనులకు పాల్పడకుండా అప్రమత్తంగా ఉండండి. ఇంకొకరిని అప్రమత్తంగా ఉంచండి.


మరింత సమాచారం తెలుసుకోండి: