ఓలా, ఉబర్ క్యాబ్స్ ని చాలామంది బుక్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా మెట్రో నగరాల్లో అయితే ఈ ఓలా, ఉబర్ క్యాబ్స్ సిటీ బస్సులాగా ప్రతినిత్యం తిరగాల్సిందే. ఎందుకంటే ఈ ఓలా, ఉబర్ క్యాబ్స్ వల్ల నగరాల్లో ప్రయాణం చాలా సులభతరం అయ్యింది. అయితే ఇప్పుడు ఓలా, ఉబర్ క్యాబ్స్ బుక్ చేసుకునేవారికి ఈ న్యూస్ సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 

 

ఆ సూపర్ గుడ్ న్యూస్ ఏంటంటే.. ఈ ఓలా, ఉబర్ క్యాబ్‌లలో ప్రయాణాలు చేసే వారికీ ఇక నుంచి క్యాబ్స్ చార్జీలు మరింత చౌకగా మారే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఓలా, ఊబర్‌లాంటి క్యాబ్‌ కంపెనీలు ఆర్జిస్తున్న కమీషన్‌ను నియంత్రించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇలాంటి కంపెనీలు ప్రతి రైడ్‌లో వచ్చే మొత్తంలో 20 శాతం మేర కమీషన్‌ రూపంలో తీసుకుంటున్నాయి. 

 

అయితే ఇప్పుడు ఈ కమిషన్ ని కాస్త 10 శాతానికి తగ్గించాలని కేంద్రం ప్రభుత్వం భావిస్తున్నట్లు ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. ఇక ఈ క్యాబ్‌ సంస్థలు ఆర్జిస్తున్న దానిపై అదనపు పన్ను విధించుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉంటుంది. అయితే ఈ క్యాబ్ లు పగలు అంత ఒక ధర ఉంటె రాత్రి అయ్యేసరికి ధరలు డబుల్ చేస్తుంది.  

 

ఒకొక్కసారి రాత్రి సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువ రేట్లు వసులు చేస్తుంటాయి. అయితే ఈ ధరలను కూడా కేంద్రం నియంత్రిస్తుంది. మాములుగా ఉండే ధరలు కంటే ఎక్కువ ఉండకూడదు అని ఒకవేళ బిజీ టైం అయితే అది కూడా రెట్టింపు మాత్రమే ఉండాలని కేంద్రం ప్రతిపాదించనుందట. ఈ కనీస ధరను రాష్ట్ర ప్రభుత్వం లేదా సదరు క్యాబ్‌ కంపెనీలు ఫిక్స్ చేసుకోవచ్చు. 

 

కాగా ఈ ధరలను ప్రతి మూడు నెలలకోసారి సమీక్షించవచ్చు. ఇక ఒక డ్రైవర్‌ రోజులో నడిపే మొత్తం రైడ్స్‌లో గరిష్ఠంగా పది శాతం రైడ్స్‌ ధరలు మాత్రమే పెంచడానికి అవకాశం ఉంటుంది. రైడ్‌ క్యాన్సిల్‌ చేసుకుంటే మొత్తం చార్జీలో పది నుంచి 50 శాతం వరకూ పెనాల్టీ కూడా విధిస్తారు. అయితే ఇది ఇటు డ్రైవర్లకు, అటు కస్టమర్లకు ఇద్దరికీ వర్తిస్తుంది. ఏది ఏమైనా ఈ న్యూస్ ఓలా, ఉబర్ క్యాబ్స్ బుక్ చేసుకునే వారికీ సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: