అమెరికాలో పిలాటస్‌ పీసీ-12 రకానికి చెందిన విమానం కుప్పకూలి తొమ్మిది మంది దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో మొత్తం 12 మంది విమానంలో ఉన్నారు. దక్షిణ డకోటాలోని చెంబర్లీన్ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటలో పైలట్‌, ఇద్దరు చిన్నారులు సహా తొమ్మిది మంది మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చెంబర్లీన్ ఎయిర్‌పోర్ట్ నుంచి విమానం గాల్లోకి ఎగిరి కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. 

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డ్‌ బృందం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించిందివాతావరణం అనుకూలించకపోవడమే దీనికి కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఉత్తర మైదాన ప్రాంతంలోని దక్షిణ డకోటాలో క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ప్రస్తుతం అక్కడ తీవ్రమైన మంచు తుఫాను ఏర్పడటంతో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం వరకు మంచు తుఫాను కొనసాగుతోందని జాతీయ వాతవరణ విభాగం హెచ్చరికలు జారీచేసింది. 

దట్టమైన మంచు పేరుకుపోయి, విజిబిలిటీ గణనీయంగా తగ్గిపోతుందని తెలిపింది. అమెరికాలో తరుచూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అక్టోబరులో రెండు ప్రపంచ యుద్ధం నాటి విమాన కుప్పకూలింది. బ్రాడ్లీ ఎయిర్‌పోర్టులో 80 ఏళ్ల నాటి యుద్ధం విమానం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు పైలెట్లు సహా మొత్తం ఏడుగురు చనిపోయారు. ఈ B-17 బాంబర్ విమానం రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొంది. 

జులైలో టెక్సాస్ నగరంలో జరిగిన విమాన ప్రమాదంలో పదిమంది మరణించారు. టెక్సాస్ మున్సిపల్ విమానాశ్రయం నుంచి బీచ్ క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ 350 ప్రైవేటు విమానం టేకాఫ్ అవుతూ హ్యాంగర్ ఢీకొట్టింది. దీంతో విమానంలో మంటలు చెలరేగి పదిమంది సజీవదహనమయ్యారు. విమానం హ్యాంగర్‌ను ఢీకొన్న సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: