ప్రపంచంలో ఆడవారికి రక్షణ కరువైంది. ఎన్ని చట్టాలు వచ్చినా ..ఎన్ని శిక్షలు విధించినా నరరూప రాక్షసులు ఆడదానిపై ఇంకా తమప్రతాపం చూపుతూనే ఉన్నారు. ఏ న్యూస్ పేపర్ లో చూసినా.. ఎక్కడో అక్కడ అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి.  9 నెలల పసికందుల దగ్గరి నుండి 90 ఏళ్ల పండుముసలి వారి వరకు ఈ మానవ మృగాలు విరుచుకుపడుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కలికాలంలో ఆడదానిగా పుట్టడమే పాపమైంది. 

 

హైదరాబాద్ లో వెటరర్నరీ డాక్టర్ పై జరిగిన అత్యాచారంతో ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా మహిళలు, యువతులు రోడ్డుమీదకి రావాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టకుని రావలసిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా రెండు రోజులక్రితం కొంత మంది దుర్మార్గులు ఆరేళ్ల పసిపాప పై అత్యాచారం చేసి ఊరుకోకుండా బెల్ట్ తో ఉరివేసి హత్య చేసారు. 

 

మళ్లీ తాజాగా 70 వృద్దురాలిపై అత్యాచారం జరిగింది. సోన్‌భద్రా జిల్లా అన్పర గ్రామంలో ఓ 70 ఏళ్ల వృద్ధురాలిపై రాంకిషన్ అనే యువకుడు అత్యాచారం చేసిన దారుణ ఘటన సంచలనం రేపింది. రాంకిషన్ మద్యం సేవించి ఆ వృద్దురాలిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యూపీ పోలీసులు రంగంలోకి దిగి బాధిత వృద్ధురాలిని ఆసుపత్రికి పంపించి చికిత్స చేయిస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన రాంకిషన్ అనే యువకుడిని యూపీ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించి విచారణ చేపట్టారు.


రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని..యూపీలో బీజేపీ పాలనలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. యూపీలో మహిళల పరిస్థితి నానాటికి దిగజారి పోతుందని, వృద్ధురాళ్లే కాదు బాలికలను అత్యంత దారుణంగా హింసిస్తున్నారని అఖిలేష్ విమర్శించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు యూపీలో మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: