వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద తనపై ఉన్న కేసులకు భయపడి దేశం దాటిన విషయం తెలిసిందే. అయితే నిత్యానంద ఏ దేశం వెళ్లి ఉంటాడంటూ విపరీతమైన చర్చ నడిచింది. కాని ఎవరూ ఊహించని విధంగా నిత్యానంద ఒక ప్రత్యేకమైన దేశం ఏర్పరాటు చేసకున్నాడు. ఇది అవాకయ్యే విషయం..కాని ఇది నిజం.

 

అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద స్వామీజీ నిత్యానంద సొంతంగా ఓ దేశాన్నే ఏర్పాటు చేసుకున్నారు. ఈక్వెడార్ సమీపంలోని ఓ చిన్న ద్వీపంలో తిష్ట వేశాడు.
 ఆ ద్వీపాన్ని హిందూ దేశంగా ప్రకటించాడు. ఆ దేశం పేరు కైలాస. దీనికోసం ఓ ప్రత్యేక వెబ్ సైట్ ను రూపొందించారు. https://www.kailaasa.org. కైలాస దేశానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇందులో పొందుపరిచారు.


అంతటితో ఆగకుండా, తన దేశంలో అడుగుపెట్టేందుకు ప్రత్యేకంగా పాస్ పోర్టును కూడా రూపొందిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోకు దగ్గర్లో ఉన్న తన ద్వీప దేశానికి ఒక పాస్‌పోర్ట్‌ను, జెండాను, జాతీయ చిహ్నాన్ని డిజైన్‌ చేశారు. తాను ధ్యానంలో కూర్చున్న ఫొటోను జాతీయ చిహ్నంగా ప్రకటించారు. ఒక ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రిని, కేబినెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. రోజూ కేబినెట్‌ భేటీలు కూడా జరుపుతున్నారని సమాచారం. ప్రధానిగా ‘మా’ని నియమించారని, గోల్డ్, రెడ్‌ కలర్లలో పాస్‌పోర్ట్‌ను రూపొందించారని ఆ ‘దేశ’వెబ్‌సైట్‌ పేర్కొంది.

 


‘కైలాస' దేశాన్ని గుర్తించాలని కోరుతూ నిత్యానంద ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేయనున్నట్లు ఆ వెబ్ సైట్ లో పొందుపరిచారు. ప్రపంచంలో హిందూ దేశాల సంఖ్య తగ్గుతోందని, అందుకే తాను కైలాస పేరుతో ప్రత్యేకంగా ఓ దేశాన్ని సృష్టించాల్సి వచ్చిందని నిత్యానంద ఉటంకించినట్లు వెబ్ సైట్ చెబుతోంది.

 

కైలాస దేశంలో పౌరసత్వం పొందాలంటే ఎంత ఎక్కవ విరాళాలు చెల్లిస్తే అంత విలాస వంతమైన జీనితాన్ని గడపవచ్చట. అక్కడ ప్లాట్ బిజినేజ్ కూడా ప్రారంభించారు. ఇతర దేశాల వారు ఇక్కడ ప్లాట్స్ కొనుగోలు చేసుకువచ్చు. ధరలు మాత్రం అంతర్జాతీయ మార్కట్ కు అణుగుణంగా నిర్ణయించినట్లు తెలిపారు. 

 

కైలాస దేశంలో ఉండే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని..ఆకలి అనేదే తెలియదని సైట్ లో పేర్కోన్నారు. ఆద్యాత్మిక విద్యకు ప్రాదాన్యం ఎక్కవగా ఉంటుందని తెలిపారు. మౌళిక సదుపాలకోసమే ఇక్కడి ప్రజలు పన్ను చెల్లించల్సి ఉంటుదని వెళ్లడించారు. ఐక్యరాజ్య సమితి నుంచి గుర్తింపు లభించిన వెంటనే అనేక విప్లవాత్మక చర్యలను చేపట్టబోతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నిత్యానంద తన సొంత దీవిలోనే మకాం వేసినట్టు సమాచారం!

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: