మనందరికీ తెలుసు అరటిపండు ఖరీదు ఎంతవుంటుందో కానీ  ఇప్పుడు చెప్పేయ్ అరటిపండు ఖరీదు వింటే షాక్ అవ్వాల్సిందే . ఇది మామూలు  అరటి పండు. కానీ దీని ఖరీదు మాత్రం సాధారణంగా లేదు.  మియామి బీచ్‌ ఆర్ట్‌ గ్యాలరీ ఇది ఇటలీలో వుంది ఈ  గ్యాలరీ ప్రదర్శనకు పెట్టిన ఓ అరటిపండు ఏకంగా రూ.85 లక్షలు పలికింది.

 

దీన్ని  ప్రదర్శనకు  మౌరిజియా కాటెలాన్‌ అనే కళాకారుడు పెట్టగా  దాన్ని కొనలేకపోయామని ఎంతోమంది  నిరాశ చెందుతూ దానిముందు నిల్చుని ఫొటోలు తీసుకుని సంతృప్తి చెందుతున్నారు. నెటిజన్లు ఎవరు కొన్నారో కానీ అతను సూపర్‌ హీరో అంటూ ఆయన్ను పొగిడి ఆకాశానికి ఎత్తారు. అయితే అంతలోనే ఈ అరటి పండు కథ అనూహ్య మలుపు తిరిగింది. అరటిపండును చూడగానే డేవిడ్‌ దతున అనే వ్యక్తికి ఆకలైందో ఏమో గానీ, వెంటనే లటుక్కున నోట్లో వేసుకున్నాడు.

 

అంతే అక్కడి జనం అంత అతను చేసిన పనికి నోరెళ్లబెట్టారు.  అతని మీద ఓ యువతైతే అరిచినంత పని చేసింది. అంతేకాదు ఆమె ‘ఏంటీ, తెలివితక్కువ పని’ అంటూ ఆయనపై ఆగ్రహం వెళ్లగక్కింది. ఈ సంఘటనను ఎవ్వరు  ఊహించని  విధంగా జరగడంతో ఈ పరిణామానికి అధికారులకు సైతం నోటమాటరాలేదు. ‘ఆకలిగా వున్నా  కళాకారుడు.. అది నేనే’ అంటూ డేవిడ్‌ తను చేసిన ఘనకార్యాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో  సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతే కాదు మరికొందరు డేవిడ్‌ ను ప్రసంశలతో  ముచ్చేసారు .  

 

లక్షలు విలువచేసిన అరటిపండును అప్పనంగా తిన్న డేవిడ్‌ రియల్‌ హీరో అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో ఆకాశానికెత్తుతున్నారు. ప్రస్తుతం పోలీసులు  ఆయన విచారణ నిమిత్తం డేవిడ్ ను  అదుపులో తీసుకున్నాడు . ఆ ఒక్క అరటిపండు డేవిడ్‌ను జనాల ముందు హీరోను చేస్తే అధికారుల ముందు దోషిగా నిలబెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: