ఇన్నాళ్లు నెలపై వెళ్లే మోటార్స్ ని చూశాం. స్పీడ్ స్పీడ్ గా.. ఎన్నో కొత్త కొత్త రకాల మోటార్స్ ని మనం చూసి ఉంటాం. అయితే ఇప్పుడు గాలిలో ఎగిరే మోటార్ ని చుడండి. మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉండే వాళ్ళం.. గాలిలో ఎగిరే మోటార్స్ వస్తే ఎంత బాగుండు అని.. ట్రాఫిక్ నుండి తప్పించుకోవచ్చు అని.. రోడ్ల గొంతల నుండి తప్పించుకోవచ్చు అని అనుకుంటుంటారు. 

 

ఈ నేపథ్యంలోనే కొత్తగా ఫ్రెంచ్ ఆటోమోటివ్ కంపెనీ లాజారెత్ అనే కొత్త మోటార్‌సైకిల్‌ను సృష్టించింది. అది హోవర్‌ బైక్‌గా మారి బైక్ ను గాలిలోకి తీసుకెళ్తుంది. కొత్త ఉత్పత్తి ఎల్‌ఎమ్‌వి లాజరేత్ 496 ధర 380,000 డాలర్లతో వస్తుంది. ఇది మన భారత మార్కెట్లో సుమారు 3.5 కోట్ల రూపాయలుగా ఉంటుంది.  

 

లాజారెత్ ఎల్‌ఎమ్‌వి 496 సాధారణ బైక్ లాగా రోడ్డుపై నడుస్తుంది అలాగే గాలిలోను ఎగురుతుంది. బైక్ గాలిలో కదిలినప్పుడు ఇది నాలుగు జెట్ ప్రొపల్షన్ ఇంజన్లను ఉపయోగిస్తుంది. ఎల్‌ఎమ్‌వి 496 కి శక్తినిచ్చే జెట్ ఇంజన్లు విమానం జెట్ ఇంజిన్లలగే ఉంటాయి. ఈ బైక్‌ ఆన్-బోర్డులో కిరోసిన్ ఇంధన ట్యాంక్ ఉంది. 

 

సౌకర్యవంతంగా.. ఎవరైనా ఈ బైక్ ను ఈజీగా నడిపే విధంగా ఈ బైక్ ఉంటుంది. కాగా బైక్ బరువు 140 కిలోలు మాత్రమే ఉంటుంది. ఈ బైక్ భవిష్యత్తులో ట్రాఫిక్లను దాటవేయగల హోవర్‌బైక్‌లాగ ఉపయోగపడుతుంది. ఈ బైక్ నడపడానికి లేదా ఎగరడానికి ఏదైనా ప్రత్యేక లైసెన్స్ అవసరమా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ బైక్ ధర సామాన్యులు అందుకోలేనంత ఎక్కువగా ఉంది. ఒకా ఈ బైక్ తో 10 గ్రామాలను అభివృద్ధి చెయ్యచ్చు. ఈ బైక్ ఖరీదు సుమారు 3.5 కోట్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: