మహిళలకు ఎల్లప్పుడూ తోడుగా.. అన్న , నాన్న తోడు అవసరం లేకుండా ఎక్కడికైనా హ్యాపీగా వెళ్లి వచ్చేలా మహిళలకు సహాయంగా ఉండే స్కూటీలో ఇప్పటికే ఎన్నో రకాల కొత్త కొత్త మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే యాక్టివా 5జి అందుబాటులోకి వచ్చి సూపర్ హిట్ అవ్వగా ఈ నెల 15న యాక్టివా 6జి కూడా భారత్ కి రానుంది. 

 

జపాన్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ అయిన హోండా సరికొత్త యాక్టివా 6 జి ని ఈ నెల 15వ తేదీన ప్రారంభించబోతోంది. అయితే ఈ సరికొత్త యాక్టీవా 6జి ఫీచర్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ స్కూటర్ ఫిచర్స్ అన్ని రహస్యంగా బయటకు వచ్చాయి. అలాంటి ఆ ఫీచర్స్ ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

 ఈ యాక్టీవా 6జి స్మార్ట్ ఫోన్ బిఎస్-6 ఉద్గార ప్రమాణాలను పాటించే 1.09.51సీసీ సామర్థ్యం గల అదే మునుపటి సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ ఇందులో వస్తోంది.

 

పాత మోడల్‌తో పోలిస్తే కాస్త తక్కువ పవర్ ఇచ్చే హోండా యాక్టివా 6Gలో కొత్తగా ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ మరియు హోండాకు చెందిన హోండా ఇకో టెక్నాలజీ సిస్టమ్‌ అదనంగా ఉంటుంది.

 

హోండా యాక్టివా 6G బిఎస్-6 వెర్షన్ స్కూటర్ కావడంతో ఇందులో మెరుగైన స్మార్ట్ పవర్ కోసం ఈఎస్పీ, సైలంట్ స్టార్ట్ సిస్టమ్ కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. 

 

యాక్టివా 6G స్కూటర్ పొడవు, 1833మీమీ, వెడల్పు 697మిమీ, ఎత్తు 1156మిమీ మరియు వీల్‌బేస్ 1260మీమీగా ఉంది.

 

యాక్టివా 6G ఫీచర్లు సెమీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ లైటింగ్, పాస్-లైట్ బటన్, బయటి వైపున్న ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ ఇంకా ఎన్నో అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

 

యాక్టివా 6G ప్రారంభ ఎక్స్-షోరూమ్‌ ధర రూ. 60,000 వరకూ ఉండొచ్చు అని అంచనా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: