అబ్భా.. ఈ బండిని చూస్తుంటే.. నాకు వెంటనే కొనియేలనుంది.. ఆలా అనిపిస్తే మాత్రం ఏం ప్రయోజనం.. ఓక ఇష్టం కోసం కొన్ని బాధ్యతలను పక్కన పెట్టలేం కదా.. సరే లెండి.. అది పక్కన పెడితే.. ఈ బండిని చూస్తే ప్రతి ఒక్కరికి కొనాలి అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంది ఈ బండి. 

 

ఇంకా అసలు విషయానికి వస్తే.. భారతదేశంలో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు భారీగా పెరిగిపోయాయి. ద్విచక్ర వాహన రంగంలో అయితే మరీ ఎక్కువగా అమ్ముడు పోతున్నాయి. అందుకే రోజు రోజుకి భారత్ మార్కెట్లోకి కొత్త కొత్త వాహనాలు వస్తున్నాయి. ఆల వచ్చిన వాహనాలలో బజాజ్ చేతక్ కూడా ఒకటి. 

 

బజాజ్ నుండి విడుదలైన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్, బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్. బజాజ్ ఆటో ఇండియా తన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతీయ మార్కెట్లో పరిచయం చేయనుంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2020 జనవరి 14 నుండి భారత మార్కెట్లోకి రానుంది. అయితే ఈ బండి దేశంలోని ఇతర ప్రాంతాలలో విస్తరించే ముందు కేవలం ఐదు నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. 

 

ఆ ఐదు నగరాలు బెంగళూరు, పూణే, ముంబై, ఢిల్లీ చెన్నై నగరాలు మాత్రమే. ఆల్ ఎలక్ట్రిక్ బజాజ్ చేతక్ కోసం బుకింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. ఈ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.10 లక్షల వరకు ఉంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. మరి ఈ బండి ఎంతమాత్రం వాహన ప్రియులను ఆకట్టుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: