ఎలక్ట్రిక్ కార్ అంటే స్పీడు పెద్దగా వెళ్లవని ఓ వాదన ఉంది. అంతే కాదు.. గంటలకు గంటలు ఛార్జింగ్ పెట్టాలి. పెట్రోల్, డీజీల్ ధరలతో పోలిస్తే మెయింటైన్స్ తక్కువే అయినా.. చార్జింగ్, వేగం వంటి సమస్యలతో వీటిపై కొనుగోలు దార్లు పెద్దగా మొగ్గు చూపడం లేదు. అయితే.. కానీ ఇప్పుడు ఈ కార్లు కూడా స్పీడు పెంచుకున్నాయి.

 

ఇప్పుడు ఎంజీ మోటార్స్‌ జెడ్‌ఎస్‌ ఈవీ పేరుతో ఎలక్ట్రిక్‌ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది 8 నిమిషాల్లో 100కిమీ వేగం అందుకుంటుందట. ఢిల్లీ , ముంబయి, అహ్మదాబాద్‌, బెంగళూరు, హైదరాబాద్‌లో మాత్రమే ఈ కారును అందుబాటులో ఉంది. 44.5 కిలోవాట్స్‌ శక్తి ఉన్న బ్యాటరీని ఒకసారి రీఛార్జి చేస్తే 340 కిలోమీటర్లు వెళ్తుందట.

 

40 నిమిషాల్లో 80శాతం ఛార్జింగ్‌ అవుతుందట. ఆఫీస్‌లోనూ, ఇంట్లోనూ ఛార్జి చేసుకోవడానికి 7.4 కిలోవాట్ల హోం ఛార్జర్‌ కూడా ఇస్తారట. ఇక రేటెంత అంటారా.. ఎక్సైట్‌ వేరియంట్‌ కారు ధర రూ.20.88లక్షలు. ఎక్స్‌క్లూజివ్‌ వేరియంట్‌ ధర రూ.23.58లక్షలు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: