ఈ మధ్యాకాలంలో ఎలక్ట్రిక్ బండ్లు చాల విడుదల అయ్యాయి.. ఎన్ని విడుదల అయ్యాయి అంటే దాదాపు ఒక నాలుగైదు కంపెనీల బండ్లు విడుదల అయ్యాయి. అయితే ఆ ఎలెక్ట్రిక్ బండ్లు అన్నిటి కంటే కూడా ఈ ఎలెక్ట్రిక్ బండి ఏ అతి తక్కువ ధరకు లభిస్తుంది.. ఆ ఎలెట్రిక్ స్కూటర్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్!

 

ఎప్పుడెప్పుడు అని ఈ వాహనం కోసం ఎదురుచూస్తున్న బైక్ ఎప్పుడు మన భారత్ లో విడుదల అవుతుందా అని చూస్తున్న ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు భారత్ మార్కెట్ లోకి అడుగు పెట్టింది.. అయితే ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త ఫీచర్స్, పెరఫామెన్స్, రేంజ్, ఇంకా ఛార్జింగ్ అన్ని మెరుగైనవి కలిగి ఉన్నాయి. 

 

అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు భారతదేశం అంతటా ఎన్నో నగరాలలో లభిస్తుంది... ఈ ఏథర్ 450 ఎక్స్ రెండు వేరియంట్లలో లభిస్తుంది.. ఒకటి ఏథర్ 450 ఎక్స్ ప్లస్, రెండోవది ఏథర్ 450 ఎక్స్ ప్రో. ఒకసారి ఛార్జింగ్ పెడితే దాదాపు 85 కిలోమీటర్ల వరకు పరుగుతీస్తుంది. కాగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. 

 

అయితే ఇప్పటి వరుకు విడుదల అయినా అన్ని ఎలెక్ట్రిక్ స్కూటర్ల కంటే ఇది 10 కిలోమీటర్లు ఎక్కువ వేగంతో నడవగలదు.. అయితే ఈ స్కూటర్ ప్రారంభ ధర ఢిల్లీలో రూ. 85,000. కానీ ఇతర నగరాలలో దీని ధర 99,000 రూపాయలు ఉంటుంది. కానీ ఇప్పటి వరుకు విడుదల అయినా అన్ని ఎలెక్ట్రిక్ స్కూటర్ల కంటే ఇది అతి తక్కువ ధరకే లభిస్తుంది. 

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: