భారత్ మార్కెట్ లో ఓ రేంజ్ లో ఉన్న కంపెనీలలో హ్యుందాయ్ కంపెనీ ఒకటి. ఈ హ్యుందాయ్ కంపెనీ నుండి ఇప్పటికే ఎన్నో వాహనాలు భారత్ లో విడుదల అయ్యి ఓ రేంజ్ ను సొంతం చేసుకున్నాయి. అలాంటి ఈ సంస్ద నుండి.. మరో అద్భుతమైన వాహనం రాబోతుంది. అది ఏంటి అంటే.. ''హ్యుందాయ్ క్రెటా''. 

 

హ్యుందాయ్ బ్రాండ్ నుంచి వచ్చే ఈ "హ్యుందాయ్ క్రెటా" 2020 ఆటో ఎక్స్‌పోలో లాంచ్ కానుంది. రాబోయే 2020 హ్యుందాయ్ క్రెటా కాస్మెటిక్ అప్ గ్రేడ్లను కలిగి ఉంది. ఇది కంపెనీ లేటెస్ట్ డిజైన్లలో తయారయ్యింది. పాత మోడల్ కంటే ఈ కారు ఎంతో గొప్పగా ఉంది.. ఈ వాహన చూడటానికి కూడా చాల అందంగా ఉంది. 

 

హ్యుందాయ్ క్రెటాలో.. పెద్ద గ్రిల్, స్లీక్ ఇండికేటర్ లాంప్స్, మాడిఫైడ్ చేయబడిన బంపర్, ముందు వెనుక భాగాలలో స్కిడ్ ప్లేట్స్, రీ డిజైన్ చేయబడిన టెయిల్ లాంప్స్ అని ఉన్నాయి. ఈ వాహనంలో భద్రత కూడా ఏ ప్లస్ లో ఉంది. అయితే ఈ వాహనం మోడల్ అద్భుతంగా.. అలాగే ఫీచర్లు ఎక్కువగా ఉండటం వల్ల ఈ వాహనం భారత్ లో ఎక్కువగా అమ్ముడుపోయే అవకాశం ఉంది. కాగా ఈ హ్యుందాయ్ క్రెటా మోడల్ వాహనం ధర దాదాపు రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షల మధ్యలో ఉంటుంది. మరి ఈ కేట్రా భారత్ వాహనదారులను ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: