ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ వాహనలు ఎక్కడ నుండి అంటే అక్కడ నుండి తెర మీదకు వస్తున్నాయి. అయితే అలాంటి ఈ ఎలెక్ట్రిక్ వాహనాలు ఒక్కో చోటా ఒకో మోడల.. ఒకో ధర. అయితే మనం అన్ని ఎలెక్ట్రిక్ వాహనాలను చూశాం.. మన ఏపీ వాహనంను చూశారా ?అదే మన ఏపీ తయారు అయినా ఎలెక్ట్రిక్ వాహనం చూశారా? 

 

అసలు ఆ వాహనం పేరు మీకు తెలుసా? దాని పేరు అవేరా. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్ పో -2020 మోటార్ షోలో ఎన్నో కొత్త కొత్త రకాల వాహనాలు వచ్చాయి. అయితే ఆ ఆటో ఎక్స్ పో -2020 మోటార్ షోకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ ఆటో ఎక్స్పో 2020లో మన ఆంధ్రాలో తయారయిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'అవెరా' కూడా ఉంది. 

 

అయితే ఈ బండి పని తీరును పరిశీలించినా మంత్రి గౌతమ్ రెడ్డి ఎలక్ట్రిక్ స్కూటర్ పని తీరు అద్భుతంగా ఉందని అయన వ్యాఖ్యానించారు. కాగా కియా మోటార్స్ ఎక్కడికి వెళ్లదని.. వెల్లదు అని.. ఇంకా పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ కంపెనీలు ఏపీని వెత్తుకుంటూ వస్తాయని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. కొత్తగా రాష్ట్రంలో రాబోయే పరిశ్రమలు, పెట్టుబడుల ప్రవాహం కూడా ఎవరూ ఆపలేరని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా నిన్న మొన్న కియా మోటర్స్ పై జరిగిన అసత్య ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: