వెస్పా.. తెలియని వారు ఉండరు... అన్నిటి కంటే కాస్టలీ స్కూటీ.. ఎందరో అమ్మాయిల కలల బండి.. అలాంటి ఈ స్కూటీ మోడల్ లో వెస్పా రేసింగ్ సిక్స్టీస్ అనే ఒక సరికొత్త స్కూటర్ ని 2020 ఆటో ఎక్స్‌పోలో పరిచయం చేసింది. ఇటాలియన్ వాహన తయారీదారు అయిన వెస్పా 2020 ఆటో ఎక్స్‌పోలో మరో కొత్త బ్రాండ్ ని విడుదల చేసింది. 

 

ఆ సరికొత్త మోడల్ పేరే వెస్ప రేసింగ్ సిక్స్టీస్. ఈ వాహనం బిఎస్- 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తయారు చేశారు. వెస్పా రేసింగ్ సిక్స్టీస్ కొత్త ఫీచర్స్, స్టైలిష్ లుక్ లో ఈ బైక్ ఉంది. అయితే ఇది సాధారణంగా మునుపటి వెస్పా రేసింగ్ లివరీల నుండి వచ్చిన స్కూటీ ఏ. ఈ వెస్పా నుండి విడుదలైన ఈ కొత్త స్కూటర్ కి సంభందించిన ధరల ఇంకా విడుదల కాలేదు. 

 

అయితే ఈ వెస్పా 125 వచ్చే నెల నుంచి విక్రయాలను ప్రారంభించనున్నట్లు తెలియజేసింది. కాగా ఈ వెస్పా సిక్స్టీస్ లో 150 సిసి ఇంజిన్ ఉంటుంది. అయితే బిఎస్-6 కంప్లైంట్ ఎస్ఎక్స్ఎల్ 150 ధర రూ. 1.26 లక్షలు వరకు ఉంది. అయితే ఈ రేసింగ్ సిక్స్టీస్ కి ఇంకా ఎక్కువ ధరే ఉంటుంది అని అంచనా.. మరి ఈ బండి ధర ఎంత ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: