అవును.. లైసెన్స్ లేకుండా బయటకు వెళ్తే.. బయటకు వెళ్లి పోలీసులకు పట్టుబడితే.. జేబులో ఉన్న డబ్బు అయినా ఖాళీ అవుతుంది.. లేదంటే మన జీవితకాలంలో ఉన్న కాలం అయినా ఖర్చు అవుతుంది.. అయితే అలా కాలము.. డబ్బు పోకుండా.. లైసెన్స్ అవసరం లేకుండా కూడా ఓ బండిని నడపచ్చట.. ఆ బండి ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. 

 

ఆ బండి ఏంటి అంటే.. రియో ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌. గత ఏడాది డిసెంబరులో ఆంపియర్ వెహికల్స్ ఈ స్కూటర్‌ను భారత్ మార్కెట్ లో లాంచ్ చేశారు. ఆంపియర్ రియో ఎంట్రీ లెవల్ 'లో' రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్.  ఆటోలు, క్యాబ్‌ల మీద ఆధారపడకుండా సిటీలో పక్క పక్క నగరాలకు వెళ్ళడానికి వీలు ఈ బండిని సహాయ పడుతుంది. 

 

ఈ ఆంపియర్ రియో ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి 8 నుండి 10 గంటల సమయం పడుతుంది. అలాంటి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు 250-వాట్ కెపాసిటీ ఎలక్ట్రిక్ మోటార్ కలదు. అయితే ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25కిలోమీటర్లు మాత్రమే... కాగా ఈ స్కూటర్ కు ఫుల్ ఛార్జింగ్ 50 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అంతేకాదు ఈ బండి లోడ్ కెపాసిటీ కూడా చాలా తక్కువ.. కేవలం అంటే కేవలం 75కిలోలు, గరిష్టంగా 120కిలోల వరకూ బరువును లాగగలదు. అలాంటి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 45,099.. ఈ స్కూటర్ కాలేజీ పిల్లలకు చాలా చక్కగా ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: