ఈ కాలంలో మిడిల్ క్లాస్ వారందరికీ అందుబాటులో ఉండే వాహనం ఏది అంటే బైక్.. ఆతరవాత మరికొంతమంది మిడిల్ క్లాస్ వారికీ అందుబాటులో ఉండే వాహనం ఏంటి అంటే.. కారు. ఇంకా ఆ కార్లలో 2020 సంవత్సరం ప్రారంభ నెల అయినా జనవరిలో ఏకార్లను ఎక్కువ కొన్నారో తెలుసా? ఈ నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 వాహనాల జాబితా ఇటీవలే విడుదలైంది. ఆ టాప్ 10 వాహనాలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

టాప్ 1 వాహనం.. మారుతి డిజైర్ కాంపాక్ట్ సెడాన్ జనవరి నెలలో దేశంలో అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. ఈ కారు టాప్ 10 జాబితాలో మొదటి స్థానంలో ఉంది.

 

టాప్ 2 వాహనం.. మారుతి బాలెనో భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆఫర్. ఈ కారు టాప్ 10 జాబితాలో రెండవ స్థానంలో ఉంది.

 

టాప్ 3 వాహనం.. మారుతి సుజుకి స్విఫ్ట్ జనవరి 2020 లో దాదాపు 19,981 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఈ మారుతి సుజుకి స్విఫ్ట్ టాప్ 10 జాబితాలో 3 వ స్థానంలో నిలిచింది. 

 

టాప్ 4 వాహనం.. మారుతి ఆల్టో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైంది.. ఈ వాహనం టాప్ 10 జాబితాలో 4 వ స్థానాన్ని కైవసం చేసుకుంది.

 

టాప్ 5 వాహనం.. మారుతి వాగన్ ఆర్ అత్యధికంగా అమ్ముడైంది.. ఈ వాహనం టాప్ 5లో నిలిచింది. 

 

టాప్ 6 వాహనం... కియా సెల్టోస్ కూడా జనవరి నెలలో బాగా అమ్ముడుపోయింది. దీంతో ఈ వాహనం టాప్ 6 నిలిచింది. 

 

టాప్ 7 వాహనం...  మారుతి ఇకో గతంలో ఎన్నడూ లేని విధంగా జనవరి నెలలో అమ్మకాలను పెంచింది. దీంతో ఈ వాహనం టాప్ 7 స్థానాన్ని సొంతం చేసుకుంది. 

 

టాప్ 8 వాహనం... మారుతి వితారా బ్రెజ్జా మంచి అమ్మకాలను సొంతం చేసుకుంది. దీంతో ఈ వాహనం జనవరిలో అత్యధిక అమ్మకాలను సొంతం చేసుకుంది. 

 

టాప్ 9 వాహనం... హ్యుందాయ్ ఐ 10 గ్రాండ్  ఇది మంచి అమ్మకాలను సొంత చేసుకోని టాప్ 9 స్థానంలో నిలిచింది. 

 

టాప్ 10 వాహనం హ్యుందాయ్ ఐ 20 ఎలైట్ మంచి అమ్మకాలతో జనవరి టాప్ 10 వాహనంగా నిలించింది. 

 

చూశారుగా.. జనవరి నెలలో ఈ వాహనాలే టాప్ వాహనాలు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: