వాతావరణాన్ని నాశనం చేస్తున్న డీజిల్‌ వాహనాలపై ఆంక్షలు విధించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని హైదరాబాద్ లో ముఖ్యంగా ఆ వాహనాలను నియంత్రించాలని రవాణాశాఖ త్వరలో ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది. హైదరాబాద్ ను పొగతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అని, డీజిల్ వాహనాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 

 

దీంతో రవాణాశాఖ చేసిన ప్రతిపాదనల పునఃసమీక్ష, నిపుణులు ఇచ్చిన నివేదికలోని వివరాల ఆధారంగా కొత్త ప్రతిపాదనలు ఇవ్వాలని అటువంటి అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని..  తెలంగాణ మోటారు వాహన చట్టానికి సవరణలు చేయాలని రవాణాశాఖ ఆలోచిస్తుంది. కొత్త జరిమానాలు తీసుకురావాలని ఆలోచనలో ఉంది. 

 

ఇంకా హైదరాబాద్‌ లో దాదాపు 15 లక్షల డీజిల్‌ వాహనాలు తిరుగుతున్నాయి. ఈ డీజిల్ వాహనాల నుండి పెద్ద మొత్తంలో కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో డీజిల్‌ వాహనాల సంఖ్య పెరగకుండా చూడాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందుకే 12ఏళ్ళు తిరిగిన డీజిల్ వాహనాలను త్వరలోనే నిషేదించాలని అని యోచిస్తున్నట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: