భారత్ ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చి అదరగొడుతుంటుంది. ఎప్పటికప్పుడు మంచి సర్ప్రైజ్ లు ఇస్తూ ఈ టాటా మోటర్స్ అదరగొడుతుంటుంది. అలాంటి ఈ టాటా మోటార్స్ నుండి ఈ ఏడాది ఎన్నో అద్భుతమైన కార్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ కార్లు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

1. టాటా మోటార్స్ నుంచి టాటా గ్రావిటస్ కారు వస్తుంది. ఈ కారు దాదాపు 18 లక్షల రూపాయల రేంజ్ లో ఉండే అవకాశమున్నట్లు ఆటో విశ్లేషకుల అంచనా వేశారు. కాగా ఈ వాహనంలో అద్భుతమైన సరికొత్త డిజైన్ లో వస్తుంది. ఈ కారులో దాదాపు 7మంది కూర్చునేలా ఈ వాహనం రెడీ అయ్యింది. 

 

2. భారత్ లో మొట్టమొదటిసారి 2020 ఆటో ఎక్స్ పోలో టాటా ఆల్ట్రోజ్ ఈవీ కారును ఆవిష్కరించారు. ఈ టాటా ఆల్ట్రోజ్ ఈవీ ధర 10లక్షల రూపాయల వరుకు ఉండవచ్చు.. అయితే ఈ ఎలక్ట్రిక్ కారు అత్యంత భద్రత, అత్యాధునిక సదుపాయాలతో వాహనదారులకు ముందుకు రానుంది. 

 

3. ​ టాటా హెక్సా బీఎస్6 మోడల్ ను 2020 ఆటో ఎక్స్ పోలో బీఎస్6 మోడల్ ను ఆవిష్కరించింది. ఇక ఈ కారు ఖరీదు రూ.12.99లక్షలు. ఈ కారు కోసం ఎంతమంది వాహనదారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.. ఎందుకంటే అంత అద్భుతమైన ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. 

 

4. ​టాటా హెచ్ బీఎక్స్ కాన్సెప్ట్... ఈ వాహనం టాటా మోటర్స్ నుండి వచ్చింది. ఈ కారు ఎంతో ఎట్రాక్టీవ్ లుక్ తో వాహనదారుల ముందుకు రానుంది. అయితే ఈ కారు ఈ సంవత్సరం చివర్లో భారత్ మార్కెట్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ కారు ఎప్పుడు భారత్ మార్కెట్లోకి అడుగుపెడుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: