ఈ మధ్యకాలంలో కొత్త కొత్త స్కూటర్లు నెలకు రెండు మూడు అయినా విడుదల అవుతున్నాయి. అయితే అలా విడుదలైన వాటిలో ఏ స్కూటర్ అయితే అతి తక్కువ ధరకు, ఎక్కువ ఫీచర్లతో వస్తుందో ఆ బైక్ నే వినియోగదారులు కొంటారు. ఈ నేపథ్యంలోనే ఓ కొత్త స్కూటర్ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులుకి వచ్చింది. 

 

ఆ స్కూటర్ ఏంటి అంటే? హీరో మాయెస్ట్రో ఎడ్జ్ 125 బీఎస్6 స్కూటర్‌ను హీరో మోటోకార్ప్ యూత్ కోసం సరికొత్తగా ఈ స్కూటర్ ను మార్కెట్లోకి విడుదల చేశారు. కాలేజీ స్టూడెంట్స్, యూత్ కోసం ఈ స్కూటర్ ను ప్రత్యేకంగా బీఎస్6 ప్రమాణాలతో రీలాంచ్ చేశారు. అయితే 2020 హీరో మాయెస్ట్రో ఎడ్జ్ 125 బీఎస్6 ప్రారంభ ధర రూ.67,960.

 

సరికొత్త హీరో మాయెస్ట్రో ఎడ్జ్ 125 బీఎస్6 స్కూటర్ మూడు విభిన్న వేరియంట్లలో లభిస్తోంది. అయితే ఈ హీరో మాయెస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్ మార్కెట్లో ఉన్న టీవీఎస్ ఎన్‌టార్క్ 125, సుజుకి యాక్సెస్ 125, యమహా రే జడ్ఆర్ 125, హోండా యాక్టివా 125 మోడళ్లకు గట్టి పోటీని ఇస్తుంది. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: