ఈ కాలంలో మధ్యతరగతి వారు ఒక కారు కొనాలి అంటే వెయ్యిసార్లు ఆలోచిస్తారు.. అంత ధర పెట్టి మూలా వెయ్యడం అవసరమా అని.. ఎన్ని సార్లు సరే అనుకున్న కారు కొనే సమయానికి మాత్రం అవసరమా అనుకుంటారు... అదే సెకండ్ హ్యాండ్ కారు అనుకోండి.. అంత బాగుండి సగం రేటుకే ఆ కారు వస్తే ఎవరు మాత్రం ఆ కార్లను వొద్దు అనుకుంటారు చెప్పండి.. 

 

అయితే తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం ఒక్క మధ్యతరగతి వారే కాదు సెలబ్రెటీలు కూడా సెకండ్ హ్యాండ్ కార్లను వినియోగిస్తున్నారట. ఆలా ఎందుకు వినియోగిస్తున్నారో తెలుసా? కారణం ఉంది. వాళ్ళ రేంజ్ కు తగ్గట్టు లాంబోర్గినీ హురకాన్ కారు కొత్తది కొనాలి అంటే అది ఖచ్చితంగా 4 కోట్ల రూపాయిలకు పైగా పెట్టాలట.. అదే సెకండ్ హ్యాండ్ అవుతే కేవలం కోటి అరవై లక్షలకే కారు అందుబాటులోకి వస్తుందట. 

 

అందుకే ఎంతో మంది సెలబ్రెటీలు సెకండ్ హ్యాండ్ కార్లను కొంటున్నారట.. అలాంటి కార్లను కూడా ప్రముఖ ఆటో సంస్దలు రోజుకు ఒకటి విడుదల చేస్తున్నాయట.. ఆ కార్లకు చాలా డిమాండ్ ఉందట.. అతి తక్కువ ధరకే అద్భుతమైన కార్లు వస్తున్నాయి అని సెలబ్రెటీలు కొనడానికి ఇష్టం చూపుతున్నారట. 

 

అయితే ఆ సెలబ్రెటీలు ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు మన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, శిల్పా శెట్టి, హనీ సింగ్, సర్దార్ సింగ్, దినేశ్ కార్తిక్ లాంటి ప్రముఖులు బిగ్ బాయ్స్ టాయ్జ్ అనే సెకండ్ హ్యాండ్ కార్ల సంస్థ నుండి వాహనాలను కొనుగోలు చేస్తున్నారట. ఇలా సెలబ్రెటీలు కూడా సెకండ్ హ్యాండ్ కార్లు వాడుతూ.. డబ్బు ఇలా ఆదా చెయ్యాలని  ఆదర్శంగా నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: