భారత్ ఆటో మార్కెట్ లో అత్యధిక వాహన విక్రయాలు అందుకుంటోన్న సంస్దల్లో మారుతీ సుజుకీ ఒకటి. ఎన్నో విభిన్నమైన కార్లను మార్కెట్ లో విడుదల చేస్తూ తన సత్తా చూపిస్తుంది.. ఇక అలాంటిది.. ఇప్పటికే ఎన్నో మోడల్స్ ను అందించిన ఈ సంస్ద బీఎస్6 మారుతీ సుజుకీ విటారా బ్రెజా వాహనం తాజాగా మార్కెట్ లో లాంచ్ అయ్యింది. 

 

అయితే ఈ బీఎస్6 మారుతీ సుజుకీ విటారా బ్రెజా పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర 7.34 లక్షల రూపాయలుగా ఉంది.. అయితే ఈ కారు వివిధ వేరియంట్లలో లభిస్తుంది.. ఇక ఈ నూతన ఫార్మట్ కనీస వెల 18,000 నుంచి గరిష్ఠంగా 1.10 లక్షల రూపాయల వరకు ఉండనుంది. అయితే ఈ విటారా బ్రెజా పెట్రోల్ కారు మొత్తం 9 వేరియంట్లలో లభించనుంది. 

 

అయితే ఈ కార్ల మైలేజి మ్యానువల్ ట్రాన్స్ మిషన్ తో పనిచేసే వేరియంట్లయితే లీటరుకు 17.03 కిలోమీటర్లు, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వాహనాలు 18.76 కిలోమీటర్ల వరకు మిల్లేజిని ఇస్తాయి.  యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో లాంటి ఫీచర్లతో కూడిన స్మార్ట్ ప్లే స్టూడియో ఈ కారులో ఉంది. అంతేకాదు ఈ కారులో ఇంకా ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.. అన్ని ఫీచర్లు ఉన్న ఈ కారు ప్రారంభ ధర 7.34 లక్షల రూపాయలుగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: