ప్రస్తుత తరానికి ప్రతి దానిపై ఇష్టం పెరుగుతుంది.. కానీ ఆ ఇష్టం ఎక్కువ కాలం నిలవటం లేదు.. ఏ వస్తువు తీసుకున్న సరే కొద్దిరోజులు మోజు ఉంటుంది.. అందుకే ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ కార్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది.. పెరిగిపోతుంది. ఎందుకంటే ? కారు కొన్న కొద్దిరోజులకే ఆ కారుపై మోజు తగ్గుతుంది.. అందుకే ఆస్థి బాగా ఉన్నవాళ్లు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి కొన్న కారును కేవలం లక్షలకు అమ్మేస్తున్నారు. 

 

ఇంకా అలా అమ్మితే ఎవరు కొనరు? ఎంతోమంది కళ్ళకు అద్దుకొని మరి కొంటున్నారు.. అందుకే కొత్తకారు కంటే సెకండ్ హ్యాండ్ కారు కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.. ఇంకా అలాంటి ఈ సమయంలో ఓ వ్యక్తి రెండు కోట్ల విలువగల ఆడి కారును కేవలం అంటే కేవలం 48లక్షలకు అమ్మేస్తున్నాడు.. ఇంకా సెకండ్ హ్యాండ్ పిచ్చోళ్ళు ఆ కారును చూసి అగగలరా? 

 

అస్సలు ఆగలేరు.. ఇక పోతే అంతమంచి కారును ఎవరు అమ్ముతున్నారు? ఎక్కడ అమ్ముతున్నారు అనే సందేహం మీకు వచ్చింది కదా.. అక్కడికే వస్తున్న.. రెండు కోట్ల ఖరీదుగల ఆడి ఆర్8 మోడల్ కారును తక్కువ ధరకే అమ్ముతున్నాం అని తమిళనాడు విరుంబాకంకు చెందిన ఓ వ్యక్తి ఓఎల్ఎక్స్ లో పెట్టాడు. దీంతో ఆ కారు కొనడానికి ఎంతోమంది ఆసక్తి చూపిస్తున్నారు.. 

 

తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న ఆ కారు తెలుపు రంగులో మెరుస్తూ కనిపిస్తుంది.. అంతే కాదు.. ఆ ఆడి కారు కేవలం అంటే కేవలం 18వేల కిలోమీటర్లే తిరిగింది అని ఆ వ్యక్తి ఓఎల్ఎక్స్ లో పెట్టాడు. అంతేకాదు.. ఆ కారు మంచి కండిషన్ లో ఉంది. అసలు ఎలాంటి గీతాలు పడకుండా ఆ కారు మెరిసిపోతుంది అంటే నమ్మండి. ఈ కారుకు అతను ఇన్సూరెన్స్ కూడా చేశాడు.. ఇంకా ఇన్ని ఫీచర్లు ఉన్న ఈ కారును అతి తక్కువ ధరకే వస్తే ఎవరు మాత్రం కొనాలి అని అనుకోరు? మీకు కొనాలి అనిపిస్తే.. ఆ కారుకు సంబంధించి నిజానిజాలు తెలుసుకొని కారును కొనుగోలు చెయ్యండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: