ఆటో సంస్దలు అన్ని కూడా బీఎస్ 4 ప్రమాణాలు ఉన్నవి అన్ని కూడా వారి వాహనాలను బీఎస్ 6 ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తుంది.. అంతే కాదు.. ఈ నూతన ఫార్మట్లొకి తీసుకు వస్తూ గతంలో ఏ అప్డేట్స్ అయితే లేవో అవి అన్ని కూడా ఈ బీఎస్ 6 ప్రమాణాలకు తగ్గ వాహనాలకు ఇస్తున్నారు. 

 

ఈ నేపథ్యంలోనే ప్రముఖ ద్విచక్ర వాహనాల సంస్ద హీరో మోటర్స్ బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా తన బైక్స్ ను మారుస్తుంది. అంతేకాదు అన్ని సంస్దలలాగే ఈ హీరో మోటర్స్ కూడా కొన్ని అప్ డేట్లనూ పొందుపరుస్తుంది. ఇప్పటికే ప్యాషన్ ప్రో, స్ప్లెండర్ ప్లస్, డెస్టిని 125, మ్యాస్ట్రో ఎడ్జ్ 125 లాంటి మోటార్ సైకిళ్లను బీఎస్6 నిబంధనలకు అనుగుణంగా రూపొందించింది. 

 

తాజాగా తన సూపర్ స్ప్లెండర్ బైక్ ను ఈ నూతన ఫార్మాట్లో అప్ డేట్ చేసింది. అయితే గత వారం జరిగిన హీరో వరల్డ్ 2020 ఈవెంట్లోనే ఈ బైక్ ను లాంచ్ చేసింది. అయితే బీఎస్6 హీరో సూపర్ స్ప్లెండర్ వాహనం ఎక్స్ షోరూంలో ప్రారంభ ధర రూ.67,300లుగా ఉంది. రెండో డిస్క్ వేరియంట్ బైక్ ధర రూ.70,800 ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: