రాయల్ ఎన్ఫీల్డ్.. ఎంతోమంది మధ్యతరగతి యువకుల కల ఇది.. కొనాలి అని ఉన్న సరే.. ధర చూసి వెనకడుగు వెయ్యాలి.. ఎందుకంటే మధ్య తరగతి తండ్రి 4 నెలలు సంపాదన ఆ బైక్ ఖరీదు. అయినప్పటికీ ఆ బైక్ ని చూడటానికి.. ఆ బైక్ లో వచ్చే కొత్త మోడల్స్ చూడటానికి యువకులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. 

 

ఇంకా అసలు విషయానికి వస్తే మనదేశంలో అమ్మాయిల నుండి అబ్బాయిల వరుకు ప్రతి ఒక్కరు ఇష్టపడే దేశీయ దిగ్గజ మోటార్ సైకిల్ రాయల్ ఎన్ఫీల్డ్ నుండి త్వరలోనే నాలుగు రకాల కొత్త బైకులు వస్తున్నాయి. ఆ బైక్స్ చూస్తే ఎవరైనా సరే వావ్ అనాల్సిందే. ఆలా ఉన్నాయి ఆ బైక్స్. అసలు ఆ బైక్ ఏంటి అనుకుంటున్నారా ? అక్కడికే వస్తున్న.. 

 

రాయల్ ఎన్ఫీల్డ్ అతి త్వరలో ఫ్లయింగ్ ఫ్లీ, రోడ్‌స్టర్ అనే రెండు కొత్త బైకులను రానున్నాయి. అందులో భాగంగానే ఈ రెండు పేర్ల మీద ట్రేడ్‌మార్క్ గుర్తింపు కూడా పొందింది. అయితే ఈ బైక్స్ తో పాటు షెర్పా, హంటర్ అనే మరో రెండు పేర్లను కూడా ట్రేడ్‌మార్క్ రిజిస్టర్ చేయించారు. అయితే ఇప్పటివరకు ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ పాతవి కావడంతో రాయల్ ఎన్ఫీల్డ్ ప్రేమికులను ఆకట్టుకోలేకపోయింది. 

 

అయితే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చే నాలుగు రకాల బైకుల్లో అద్భుతమైన ఫీచర్లు.. అద్భుతమైన టెక్నాలజీతో అదరగొట్టనున్నారు.. మరి ఈ నాలుగు రకాల బైక్స్ రాయల్ ఎన్ఫీల్డ్ ప్రియులను ఎంత ఆకట్టుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: